ఎండుద్రాక్ష అంటే ఎవరికి ఇష్టం ఉండదు.కాని తినే అలవాటే తక్కువ.
కాని రోజు ఉదయాన్నే ఎండుద్రాక్షలు తింటే ఒకటి రెండు కాదు ఎన్నో లాభాలున్నాయి.వాటిలో కొన్ని చదివి తెలుసుకోండి.
* ఎండుద్రాక్షలో విటమిన్ బి, ఐరన్, పొటాషియం బాగా దొరుకుతాయి.అంతేకాదు, కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఉండటం ఎండుద్రాక్ష స్పెషాలిటి.
* బ్లడ్ ప్రెషర్ సమస్యలతో బాధపడేవారు ఎండుద్రాక్షను ఆశ్రయించడం మంచిది.దీంట్లో ఉండే పొటాషియం,మీ బిపిని ట్రాక్ లో పెడుతుంది.
* పాలతో ఎండుద్రాక్ష తీసుకుంటే జీర్ణక్రియకు ఎంతో మేలు జరుగుతుంది.ఉదార సమస్యలను చెక్ పెడుతుంది ఎండుద్రాక్ష.
* వైరల్ ఇంఫెక్షన్స్, జ్వరం, జలుబు లాంటివి దరిచేరకుండా ఉండాలంటే రెగ్యలర్ గా ఎండుద్రాక్ష తినే అలవాటు ఉంటే మంచిది.ఎందుకంటే దీంట్లో యాంటిబ్యాక్టిరియా లక్షణాలు దండిగా ఉంటాయి.
* అనీమియాతో ఇబ్బందిపడేవారు కూడా ఎండుద్రాక్షను ప్రేమించడం మొదలుపెట్టాలి.ఇవి మీ శరీరానికి కావాల్సిన ఐరన్ ని అందిస్తాయి.
* ఎండుద్రాక్షలో బీటా కెరోటిన్ కూడా లభిస్తుంది.ఇది కంటిచూపుకి మంచిది.
* కీళ్ళనొప్పులతో బాధపడేవారు ఖచ్చితంగా ఎండుద్రాక్షను డైట్ లో చేర్చుకోవాలి.ఇందులో దొరికే బొరాన్ కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.