విశ్వక్ సేన్ హిట్ 6 రోజుల కలెక్షన్లు.. ఎంతంటే?

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా మూవీ ‘హిట్’ రిలీజ్‌కు ముందే మంచి అంచనాలను క్రియేట్ చేసింది.ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడనే ఒక్క అంశంతో ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

 Vishwak Sen Hit Movie 6 Days Collections 6-TeluguStop.com

ఇక ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా రావడంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.ముఖ్యంగా సస్పెన్స్ జోనర్‌ అంటే ఇష్టపడే వారికి ఈ సినిమా ఓ మంచి విందులా అనిపించింది.

శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడం, బాక్సాఫీస్ వద్ద పెద్దగా సినిమాలు లేకపోవడంతో హిట్ సినిమాను చూసేందుకు జనాలు ఆసక్తి చూపించారు.ఇక ఈ సినిమా రిలీజ్ అయిన 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.5.70 కోట్ల మేర షేర్ వసూళ్లు సాధించింది.

చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఇంతమేర కలెక్ట్ చేయడంతో ఈ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో పడ్డారు చిత్ర నిర్మాత నాని.ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ పార్ట్‌ను అతి త్వరలో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 6 రోజుల్లో కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 2.54 కోట్లు

సీడెడ్ – 0.39 కోట్లు

గుంటూరు – 0.31 కోట్లు

ఉత్తరాంధ్ర – 0.47 కోట్లు

ఈస్ట్ – 0.23 కోట్లు

వెస్ట్ – 0.20 కోట్లు

కృష్ణా – 0.26 కోట్లు

నెల్లూరు – 0.13 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 4.53 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 0.21 కోట్లు

రెస్టాఫ్ వరల్డ్ – 0.96 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ – 5.70 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube