రష్మీ గౌతమ్ కు కూడా అదే సమస్య.. అయినా జబర్దస్త్ ను వదలని అందాల యాంకర్!

తెలుగు బుల్లితెరపేక్షకులకు యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ యాంకర్ గా రష్మీ మనందరికీ సుపరిచితమే.

 Shocking News On Jabardasth Show And Rashmi Gautam Details, Rashmi Gautham, Jabardasth, Anasuya, Remuneration, Rashmi Gautam Remuneration, Anchor Rashmi Gautam, Hyper Aadi, Sudheer, Getup Srinu, Mallemala-TeluguStop.com

జబర్దస్త్ షో ద్వారా కమెడియన్స్ తో పాటు యాంకర్స్ కూడా భారీ స్థాయిలో ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఇక జబర్దస్త్ షో కి అనసూయ ఎక్స్ ట్రా జబర్దస్త్ కి రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో కమెడియన్లు ఒక్కొక్కరుగా జబర్దస్త్ నుంచి వెళ్లిపోతున్న విషయం తెలిసిందే.

 Shocking News On Jabardasth Show And Rashmi Gautam Details, Rashmi Gautham, Jabardasth, Anasuya, Remuneration, Rashmi Gautam Remuneration, Anchor Rashmi Gautam, Hyper Aadi, Sudheer, Getup Srinu, Mallemala-రష్మీ గౌతమ్ కు కూడా అదే సమస్య.. అయినా జబర్దస్త్ ను వదలని అందాల యాంకర్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే అనసూయ కూడా జబర్దస్త్ నుంచి బయటికి వచ్చే పరిస్థితులు ఏర్పడినట్టుగా తెలుస్తోంది.

అంతేకాకుండా యాంకర్ రష్మీ గౌతమ్ కూడా బయటకు రావచ్చు అంటూ వార్తలు వినిపించాయి.కానీ రష్మీ గౌతమ్ మాత్రం షో నిర్వహకులు షాక్ ఇచ్చినప్పటికీ అక్కడే ఉండడానికి ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే జబర్దస్త్ నుంచి ఎవరు వెళ్లి పోయినా కూడా రష్మి గౌతమ్ వెళ్లడానికి మాత్రం ఇష్టపడడం లేదు.ఒక విధంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో భారీగానే పారితోషికం అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఒక ఎపిసోడ్ గాను దాదాపు లక్షకు పైగానే ఆమెకు అందుతునట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇటీవలే కొందరి పారితోషకాలు తగ్గించడం వల్లే బయటకు వచ్చేసారు అంటూ వార్తలు వినిపించాయి.అయితే అందరితో పాటుగా రష్మీ గౌతమ్ కి కూడా కొంత వరకు పారితోషికాన్ని తగ్గించారట.అయినా కూడా రష్మి గౌతమ్ ఇంకా కొన్నాళ్లపాటు జబర్దస్త్ లోనే కొనసాగాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

కాగా ఇటీవల జబర్దస్త్ షో నుంచి హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లాంటి కమెడియన్లు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్న విషయం తెలిసిందే.జబర్దస్త్ షో నుంచి వెళ్ళిపోతున్న ఆర్టిస్టులు ఇతర షోలలో పాల్గొంటూ ప్రేక్షకులను నవ్విస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube