పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్లకు కోరుకున్న లక్ష్యాలను సాధించడం సులువు కాదు.అయితే శ్రీకాంత్( Srikanth ) అనే యువకుడు మాత్రం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏకంగా 9 ప్రభుత్వ ఉద్యోగాలను( 9 Govt Jobs ) సాధించి సత్తా చాటారు.
నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన శ్రీకాంత్ 2014 సంవత్సరంలో తండ్రిని 2019 సంవత్సరంలో తల్లిని కోల్పోయారు.అక్క శ్రీలక్ష్మి ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ కుటుంబాన్ని నడిపించారు.
సోదరి సహాయసహకారాలతో 2020 సంవత్సరంలో ఎంబీఏ పూర్తి చేసిన శ్రీకాంత్ 2021 సంవత్సరంలో హైదరాబాద్ లో బ్యాంకింగ్ శిక్షణ కేంద్రంలో చేరారు.తొలి ప్రయత్నంలో నిరాశ ఎదురైనా నోటిఫికేషన్ వచ్చిన ప్రతి పరీక్ష రాస్తూ కెరీర్ పరంగా శ్రీకాంత్ ముందడుగులు వేశారు.2022 సంవత్సరంలో సౌత్ ఇండియా బ్యాంక్ లో జాబ్ సాధించిన శ్రీకాంత్ 2022లో మరో రెండు జాబ్స్ వచ్చినా చేరలేదు.తాజాగా విడుదలైన ఫలితాలలో ఏడు ఉద్యోగాలు సాధించి వార్తల్లో నిలిచారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ జాబ్,( Credit Officer Job ) ఏకలవ్య మోడల్ స్కూల్ లో అకౌంటెంట్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఏవో, ఐబీపీఎస్ క్లర్క్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎంప్లాయీస్ స్టేట్ యూనియన్ కార్పొరేషన్ లో అప్పర్ డివిజన్ క్లర్క్, సౌత్ ఇండియన్ బ్యాంక్ పీవో, కరీంనగర్ డీసీసీబీలో క్లర్క్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ పీవో, ఆర్.ఆర్.బీ క్లర్క్ ఉద్యోగాలను సాధించారు.
ప్రస్తుతానికి ఏకలవ్య మోడల్ స్కూల్ జాబ్ లో చేరాలని ఉందని ఆయన చెబుతున్నారు.కొన్ని ఉద్యోగాలకు సంబంధించి తుది ఫలితాలు రావాల్సి ఉందని సమాచారం అందుతోంది.అక్క, స్నేహితుల సపోర్ట్ తో తాను సులువుగా కెరీర్ పరంగా సక్సెస్ సాధించానని ఆయన చెబుతున్నారు.
శ్రీకాంత్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను మాత్రం ఎంతగానో ఆకట్టుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.