కొన్ని కొన్ని సార్లు కొందరు డైరెక్టర్లు ఎప్పుడో అనగా హీరోలతో కమిట్మెంట్ తీసుకొని ఏళ్లు గడిచినా కూడా సినిమా పూర్తి చేయకుండా వాయిదాలు వేసుకుంటూ వస్తుంటారు.దీంతో ఆ హీరోలా ఫ్యాన్స్ ఆ డైరెక్టర్లపై మండిపడుతూ ఉంటారు.
కొన్ని కొన్ని సార్లు ఆ సినిమాలు వస్తాయా.రావా.
అన్న అనుమానాలు కూడా వస్తుంటాయి.పైగా డైరెక్టర్లు కూడా ఒకేసారి రెండు మూడు సినిమాలకు కమిట్మెంట్లు ఇచ్చి ప్లాన్ లేకుండా అన్ని సినిమాలు తలపై పెట్టుకొని ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారు.
ఇప్పుడు అలాంటిదే ఒక డైరెక్టర్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్నాడు.
సినీ ప్రియులకు డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు.
ఆయన కాంబినేషన్లో సినిమా చేయడానికి ఏ హీరో అయినా ఇష్టపడాల్సిందే.భారతీయుడు, జీన్స్, అపరిచితుడు, రోబో వంటి చిత్రాలు ఈయనకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ప్రస్తుతం అగ్ర స్థాయి డైరెక్టర్లలో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.
అయితే ఇప్పుడు ఈయన తన సొంత భాషల్లోనే కాకుండా తెలుగు భాషల్లో కూడా సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు ప్రస్తుతం ఆయనకో లీవుడ్ స్టార్ హీరోతో ఒక సినిమా, టాలీవుడ్ స్టార్ హీరోతో మరో సినిమా చేస్తున్నాడు.
కానీ ఆ సినిమాలు ప్లాన్ లేకుండా సాగుతున్నట్లు అనిపిస్తుంది.దీంతో ఆ స్టార్ హీరోల అభిమానులు ఈ డైరెక్టర్ పై ఫైర్ అవుతున్నారు.
ఇంతకు అసలు విషయం ఏంటంటే కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.భారీ అంచనాల నడుమ ఈ సినిమా రూపొందుతుంది.అయితే మొదట్లో ఈ సినిమా కొన్ని కారణాలవల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే.దీంతో ఆ సమయంలో తెలుగులో రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ చేస్తానని కమిట్మెంట్ ఇచ్చాడు.
ఇక ఆ సమయంలో ఈయనకు ఏ సినిమాలు లేకపోవడంతో రామ్ చరణ్ సినిమాను 60 శాతం వరకు పూర్తి చేశాడు.అదే సమయంలో భారతీయుడు 2 సినిమా కూడా చేయటానికి గ్రీన్ సిగ్నల్ రావటంతో వెంటనే ఆ సినిమా చేయటానికి ఎటువంటి ఆలస్యం చేయకుండా రామ్ చరణ్ సినిమాకు బ్రేక్ ఇచ్చి భారతీయుడు 2 సినిమా చేయడానికి వెళ్లాడు.
దీంతో ఇక్కడినుండి రామ్ చరణ్ ఫాన్స్ ఆయనపై బాగా ఫైర్ అయ్యారు.సినిమాను మధ్యలో వదిలేసి అక్కడికి వెళ్లడం ఏంటి అని.అయితే పూర్తిగా అయినా చేయాలి కదా అంటూ గుర్రంటున్నారు.ఇక భారతీయుడు 2 సినిమాను కూడా మొదలుపెట్టి మధ్యలో బ్రేక్ ఇచ్చి రామ్ చరణ్ సినిమాను పూర్తి చేయడానికి మళ్లీ ఇక్కడికి వచ్చాడు శంకర్.
అయితే భారతీయుడు 2 ఇంకో 60 రోజులైతే పూర్తవుతుందన్న సమయంలో అక్కడ బ్రేక్ ఇచ్చి ఇక్కడికి రావడంతో కమల్ హాసన్ ఫ్యాన్స్ ఈయనపై మరింత మండిపడుతున్నారు ముందు మన సినిమా పూర్తి చేయాలి కానీ అక్కడ సినిమాలు కంప్లీట్ చేయడం ఏంటి అంటూ బాగా ఫైర్ అవుతున్నారు.
దీంతో శంకర్ పరిస్థితి మాత్రం ప్రస్తుతం దారుణంగా ఉందని చెప్పవచ్చు.
పైగా ఇద్దరు స్టార్ హీరోలు కాబట్టి ఆయనకు ఫ్యాన్స్ నుండి బాగా ఒత్తిడి ఎక్కువవుతుంది.ఇక దీంతో ఆయన ఏం జరిగినా సరే అన్నట్లు ముందు రామ్ చరణ్ సినిమా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.