దేశ భాషలందు తెలుగు లెస్సా అంటారు, తెలుగు బాషలో ఉన్న కమ్మదనం, తీయదనం మరే భాషలో ఉండదంటే అతిశయోక్తి కాదు.ప్రపంచ ప్రాచీన భాషలలో తెలుగు బాష కూడా అత్యంత ప్రాచీన బాషగా గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా అమెరికాలో విదేశీ బాషలు మాట్లాడే వారిలో ఏ బాషను అత్యధికంగా మాట్లాడుతున్నారనే సర్వే చేపట్టగా అందులో మన తెలుగు బాష అగ్ర స్థానంలో నిలిచింది.ఇంతై వటుడింతై అన్నట్టుగా తెలుగు బాషను మాట్లాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందట.కేవలం ఇదంతా 10 ఏళ్ళ కాలంలో జరిగిందని తెలుస్తోంది.ఇదిలాఉంటే.
అసలు తెలుగు బాష అమెరికాలో ఇతర భాషల కంటే అగ్ర స్థానంలో ఉండటానికి గల కారణం ఏంటి అనే విషయంపై క్యాపిటలిస్ట్ అవిరల్ బట్నాగర్ సర్వేలో వెల్లడించారు.అమెరికాకు వలసలు వెళ్ళే వారిలో అత్యధిక శాతం మంది భారతీయ నిపుణులు, విద్యార్ధులు ఉండగా అందులో తెలుగు వారు అత్యధికంగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
అంతేకాదు తెలుగు బాషను అమెరికాలో స్థిరపడిన కుటుంబాలు మాత్రమే కాకుండా స్థానికులు సైతం తెలుగు బాషను నేర్చుకునేందుకు మొగ్గు చూపుతున్నారట.

సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం 2010 -17 మధ్య కాలంలో తెలుగు బాషను మాట్లాడే వారి సంఖ్య దాదాపు 86 శాతం పెరిగిందట.ఆ తరువాత తెలుగు బాష తరువాతి స్థానంలో అరబిక్ బాష 62 శాతంతో నిలిచిందట.ఆ తరువాత స్థానంలో హిందీ 61 శాతం, ఉర్హూ 45 శాతం మాట్లాడే వారు ఉండగా చైనీస్ బాష 35 శాతం , గుజరాత్ బాష 31 స్థానంలో నిలిచాయి.
కాగా తెలుగు బాషకు అంతటి గుర్తింపు రావడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న మన తెలుగు ఎన్నారైలే.ఉండేది అమెరికాలోనైనా సరే మన బాషలో మాట్లాడుకోవడమే కాకుండా, వారి పిల్లలకు సైతం తెలుగు బాషను ప్రత్యేకంగా నేర్పించడమే కారణమని అంటున్నారు పరిశీలకులు.







