నేడు దాదాపు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు తప్పని సరి అయిపోయాయి.మారుతున్న రోజులకు అనుగుణంగా మనిషి కూడా మారిపోతున్నాడు.
ఒకప్పుడు కేవలం చదువుకున్నవారు మొబైల్ వాడేవారు.కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.
చదువుతో తేడాలేకుండా అందరూ ఇపుడు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు.దాంతో సోషల్ మీడియా వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది.
అలాగే డిజిటల్ ఇండియా నినాదం మోడీ ఏ ముహూర్తాన స్టార్ట్ చేసాడో తెలియదు గాని, ప్రస్తుతం ఆర్థికపరమైన లావాదేవీలు ఆన్లైన్లో జరపడం పరిపాటిగా మారింది.ఏం కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇంటికే తెప్పించుకుంటున్నారు.
ముఖ్యంగా ఈ కామర్స్ సంస్థలు ఇక్కడ రాజ్యమేలుతున్నాయి.ఈ క్రమంలోనే అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మీషో వంటి సైట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.కావలసిన వస్తువులకు ఎక్కడికో వెళ్ళకుండా ఇంటి దగ్గరకే తమకు కావాల్సిన వస్తువులు తెప్పించుకుంటున్నారు.అయితే ఇలా ఆన్లైన్లో ఆర్డర్స్ కారణంగా లాభాలు మాత్రమే కాకుండా నష్టాలు కూడా జరుగుతున్నాయి.
ఇటీవలికాలంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుండటం మీరు గమనించవచ్చు.ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా మరొకటి వచ్చి ఎంతోమంది కస్టమర్లు ఇబ్బందులకు గురవుతున్నారు.

తాజాగా బ్రిటన్ లో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.బ్రిటన్ కు చెందిన మహిళ ఒక ఆన్లైన్ యాప్ లో రెండు ‘లెవీస్ జీన్స్’ ఆర్డర్ చేసింది.2 రోజుల తర్వాత ఆమె ఆర్డర్ ఇంటికి డెలివరీ అయింది.దాంతో ఆమె అందంగా డెలివరీ పార్సల్ తెరవడానికి ప్రయత్నించింది.
కానీ అందులో నుంచి దుర్వాసన రావడాన్ని గమనించింది.ఏమిటా అని తెరిచి చూడగా లోపల కుళ్లిపోయిన ఉల్లిపాయలు ఆమెకు దర్శనమిచ్చాయి.
దీంతో ఒక్కసారిగా షాక్ అయిన మహిళ వెంటనే ఫిర్యాదు చేసింది.అయితే కస్టమర్ కేర్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
ఇలాంటి సంఘటన మీకు కూడా జరిగితే కింద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.







