2018 లో నిర్వహించిన గ్రూప్ -1 మెయిన్స్( Group 1 Mains ) ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది.ఈ మేరకు ప్రశ్నాపత్రాల డిజిటల్ వాల్యూయేషన్( Digital Valuation ) పై అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
డిజిటల్ వాల్యూయేషన్ లో భారీగా అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆరు నెలల్లో మళ్లీ గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాలని ఏపీ హైకోర్టు( AP High Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు మెయిన్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం స్పందించింది.గ్రూప్ -1 పై హైకోర్టు తీర్పుపై ఆందోళన చెందవద్దని చెప్పింది.
ఉద్యోగాలకు ఎంపికైన వారి ప్రయోజనాలను కాపాడుతామని పేర్కొంది.న్యాయస్థానం తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని తెలిపింది.