శివునికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారా.. వారిని ఎక్కడ పూజిస్తారు తెలుసా..?

శివపార్వతులను ఆదిదేవుళ్ళుగా భక్తులు కొలుస్తూ ఉంటారు.ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తూ ఉంటారు.

 Does Lord Shiva Have Three Daughters.. Do You Know Where They Are Worshipped ,-TeluguStop.com

శివరాత్రి రోజు జాగారాలు కూడా చేస్తూ ఉంటారు.అలాగే శివమాల వేసుకుంటారు.

దేశంలో శివుడిని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు.కానీ ఆయనది ఒకటే రూపం లింగ రూపం.

శివుని( Lord Shiva ) గురించి అనేక కథనాలు ఉన్నాయి.భోళా శంకరుడు అని రుద్రుడు అని మిగతా దేవుళ్ళ కంటే శివుడిని మాత్రమే చాలా పేర్లతో పిలుస్తారు.

ఎందుకంటే శివునికి గణేశుడు, కుమారస్వామి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.మిగతా వారికి సంతానం ఉన్నట్లు ఎక్కువగా చెప్పబడలేదు.

ఈ తరుణంలో అసలు శివునికి ఇద్దరు కుమారులు కాదని ముగ్గురు కూతుర్లు కూడా ఉన్నారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి.వాటిలో పద్మ పురాణం ఒకటి.

పద్మ పురాణం లో శివుని గురించి ఏం చెప్పారు ఇప్పుడు తెలుసుకుందాం.శివపార్వతులకు అసలైన సంతానం వినాయకుడు, కుమార స్వామిగా చెబుతారు.

Telugu Ashoka Sundari, Bhakti, Devotional, Ganesh, Kumaraswamy, Lord Shiva, Mans

కానీ ఈ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారని వీరికి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు.పద్మ పురాణం ప్రకారం శివునికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు.వీరు శివుని అనుగ్రహం వల్ల జన్మించారని తెలుస్తుంది.అశోక సుందరి( Ashoka Sundari ) శివుని మొదటి కుమార్తె.ఈమెను పార్వతి సృష్టించిందని చెబుతారు.తన ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి అశోక సుందరినీ పుట్టించిందని అంటున్నారు.

Telugu Ashoka Sundari, Bhakti, Devotional, Ganesh, Kumaraswamy, Lord Shiva, Mans

అశోక సుందరి దేవిని ఆరాధిస్తే దుఃఖాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.శివుని రెండో కుమార్తె జ్యోతి.ఈమెను జ్వాలాముఖి( Jwalamukhi ) అని కూడా అంటారు.అయితే ఈమె పార్వతి దేవి తన నుదుటి నుంచి ఉద్భవించిందని చెబుతున్నారు.ఇక శివుని చివరి కుమార్తె మానసగా చెబుతున్నారు.అయితే మిగతా ఇద్దరి కంటే ఈమెను ప్రత్యేకంగా చెబుతున్నారు.

శివుని అనుగ్రహంతో ఈమె జన్మించింది అని చెబుతున్నారు.మనస దేవిని బెంగాల్ దేవాలయంలో ప్రత్యేకంగా పూజిస్తూ ఉన్నారు.

అయితే ఈమెకు విగ్రహం అంటూ లేదు.మట్టి, పాము లేదా మట్టి కుండా లేదా చెట్టు కొమ్మను మనస దేవిగా పూజిస్తారు.

చికెన్ ఫాక్స్, పాముకాటు గురైన వారిని ఈ దేవి కాపాడుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube