అయ్యప్ప దీక్షలో ఇరుముడి అంటే ఏమిటి.. శబరిమలకు ఎలా వెళ్లాలి..

అయ్యప్ప స్వామి దీక్ష మోక్షదాయకం అని వేద పండితులు చెబుతూ ఉంటారు.మనసు నిండా స్వామిని కొలవడమే దీక్ష పరమార్థమని కూడా చెబుతారు.

 What Is Irumudi In Ayyappa Deeksha How To Go To Sabarimala , Ayyappa Deeksha , S-TeluguStop.com

మండల కాలం దీక్ష పూర్తి చేసిన స్వాములు టెంకాయ అనే దేహంలో ఆత్మ అనే నేయి పోసి శబరిమలకు మోసుకెళ్లి అయ్యప్పకు సమర్పించడం దీక్ష ప్రాముఖ్యత.కుల మతాలకతీతంగా అందరూ ఒక్కటే అని దీక్షాపరునిలో అయ్యప్ప స్వామి కొలువై ఉంటాడని దీక్షకాలంలోనే కాకుండా ఆ సుగుణాలను జీవితాంతం పాటించి జీవితాంతం సంతోషంగా ఉండాలని దీక్ష చెబుతూ ఉంది.

రోజుల్లో ఒకసారి భోజనం మరోసారి అల్పాహారం, రెండు సార్లు చల్లటి నీటితో స్నానం, నేలపై నిద్రపోవడం వంటి కఠినమైన నియమాలను పాటిస్తూ స్వామివారి భక్తి పరవశంలో మునిగితేలుతున్న దీక్షాపరుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది.

శబరిమల యాత్రకు ఎలా వెళ్లాలంటే అయ్యప్ప స్వామి దర్శనానికి ట్రావెల్ కోర్ బోర్డ్ ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంది.

ఇందులో భాగంగా ముందుగా క్యూబుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయానికి అనుమతి ఉంటుంది.ఇంతకు ముందులాగా ఆలయానికి వెళ్లే వివిధ మార్గాల ద్వారా కేరళ చేరుకొని ఎరిమేలీలో స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి పెద్ద పాదం ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్లే అవకాశం ఉంటుంది.

అలాకాకుండా నేరుగా పంబాకు చేరుకొని పంబా నదిలో స్నానం చేసి అక్కడ నుంచి చిన్న పాదం ద్వారా వెళ్లే అవకాశం ఉంటుంది.వారిని రోజుకు లక్ష మందిని అనుమతిస్తుండగా శని, ఆదివారాల్లో ఆ సంఖ్య ఇంకా పెంచుతున్నారు.

Telugu Ayyappa Deeksha, Devotional, Irumudi, Kerala, Sabarimala, Travelcore-Late

దీక్ష కాలం ముగిసిన వారు ఆరు పర్యాయాలు శబరి యాత్రకు వెళ్లి వచ్చిన గురుస్వాములతో ఇరుముడి కట్టించుకోవడం మంచిది.మొదటి ముడిని ఇరుముడి అని అంటారు.ఈ సంచిలో పూజ ద్రవ్యాలు ఉంచుకుంటారు.ఇదే ఇరుముడిలో దేహంగా భావించి టెంకాయను శుభ్రం చేసి ఆత్మగా భావించే ఆవు నెయ్యిని కూడా పోస్తారు. నెయ్యితో నిండిన ఆత్మను ఇరుముడిలో కట్టుకుంటూ ఉంటారు.ఇంకో పక్క ఉన్న ఇరుముడిలో అవసరమైన పదార్థాలు పెట్టుకుని ఉంటారు.

దీక్షపరులు తమ వెంట ఇరుముడితో పాటు ఒక జత దుస్తులు కూడా తీసుకుని వెళ్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube