వైసీపీ ప్రభుత్వంపై జనసేన నేత నాదెండ్ల మనోహార్ మండిపడ్డారు.ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు.జగన్ సీఎం అయ్యాక ఒక్క గుంటూరు జిల్లాలోనే 281 మంది కౌలు రైతులు బలవన్మరణం చెందారని చెప్పారు.
రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.రాష్ట్రంలో రైతులను ఆదుకుంటున్న ఏకైక పార్టీ జనసేన అని స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఆయన బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారు.