ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయించకూడదని చెప్పినా, ఆ నిబంధనను చాలా మంది వ్యాపారులు పట్టించుకోరు.ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండులలో ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులను అమ్ముతుంటారు.
ఇదే రీతిలో రైలులో ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు వాటర్ బాటిల్ విక్రయించిన వ్యాపారికి కోలుకోలేని షాక్ తగిలింది.ఎంఆర్‌పి రూ.15 ఉండగా రూ.20 కి ఓ వినియోగదారుడు వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఆ వీడియోను చూసిన భారతీయ రైల్వే కఠిన చర్యలు తీసుకుంది.వాటర్ బాటిళ్లను రూ.5 ఎక్కువ ధరకు విక్రయిస్తున్న క్యాటరింగ్ కంపెనీకి రైల్వేలోని అంబాలా డివిజన్ శుక్రవారం రూ.లక్ష జరిమానా విధించింది.క్యాటరింగ్ కంపెనీ మేనేజర్‌ను కూడా ఆర్పీఎఫ్ అరెస్ట్ చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని గోండా క్యాటరింగ్ కంపెనీ పేరు M/s చంద్ర మౌళి మిశ్రా.ఇటీవలే కంపెనీ IRCTC ఆమోదంతో అంబాలా డివిజన్‌లో లక్నో-చండీగఢ్-లక్నో రైలులో క్యాటరింగ్ సేవలను అందించడం ప్రారంభించింది.ఫిర్యాదుదారు ప్రయాణీకుడి పేరు శివం భట్.చండీగఢ్ నుంచి షాజహాన్‌పూర్ వెళ్తున్నాడు.ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో, రైల్వే క్యాటరింగ్ కంపెనీ తనకు రూ.15 విలువైన నీటిని రూ.20కి విక్రయించిందని శివమ్ పేర్కొన్నాడు.దినేష్ అనే వ్యక్తి నీటిని కొనుగోలు చేశాడు.
శివమ్ ఫిర్యాదు వీడియో వైరల్‌గా మారింది.ఈ విషయం అంబాలా డివిజన్ రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది.
ఆ తర్వాత క్యాటరింగ్ కంపెనీపై కఠిన చర్యలు తీసుకున్నారు.చంద్రమౌళి మిశ్రా క్యాటరింగ్ కంపెనీ మేనేజర్ రవి కుమార్‌ను అరెస్టు చేశారు.
దీంతోపాటు డీఆర్‌ఎం మన్‌దీప్ సింగ్ ఆ కంపెనీకి రూ.లక్ష జరిమానా విధించారు.ఫిర్యాదు అందిన వెంటనే కంపెనీకి ఏఆర్‌సీటీసీ అనుమతి ఉందో లేదో తనిఖీ చేశామని అంబాలా డివిజన్ రైల్వే అధికారి హరి మోహన్ తెలిపారు.ఇది నిర్ధారించిన తర్వాత, నిందితులు క్యాటరింగ్ కంపెనీకి జరిమానా విధించినట్లు వెల్లడించారు.దీంతో రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష చెల్లించాల్సి వచ్చిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.







