కాంగ్రెస్ తో పొత్తుపై సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు.సీపీఎం పార్టీతో పొత్తుపై కాంగ్రెస్ కు సీరియస్ నెస్ లేదని మండిపడ్డారు.
ఈ క్రమంలో మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తేనే కాంగ్రెస్ తో పొత్తు అని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.కాదంటే ఇంకా తాము తగ్గేది లేదని చెప్పారు.
కాంగ్రెస్ ఒప్పుకోని పక్షంలో సీపీఎం వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.రేపటి వరకు చూసి పొలిట్ బ్యూరో సమావేశంలో పోటీపై చర్చిస్తామన్నారు.
సీపీఎం ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.