సాధారణంగా మన ఇళ్లలో పక్షులు గూళ్ళు కడుతూ ఉంటాయి.అయితే ఇలా పక్షులు గూళ్ళు కట్టుకోవడం గురించి వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ఏం చెబుతుందంటే, పక్షులకు కొన్ని దిక్కుల్లో గూళ్ళు కట్టుకోవడం వలన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువగా మనం ఇళ్లలో పావురాలు, పిచ్చుకలు, పొలం పిచ్చుకలు, గూళ్ళు కట్టుకోవడం చూస్తూ ఉంటాము.అయితే ఇలా పక్షులు( Birds ) ఇంట్లో ఏ దిక్కున తమ ఇంటిని నిర్మించుకుంటే మంచిది అంటే.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి బాల్కనీలో కానీ, కిటికీలో కానీ పిచ్చుకలు( Sparrow ) చిన్న చిన్న గూళ్ళు కట్టుకుంటే మాత్రం అది శుభ సూచకంగా చెబుతున్నారు.
ఇంట్లో లక్ష్మీదేవి( Lakshmi Devi ) కొలువై ఉండటానికి ఎక్కువగా ఆస్కారాలు ఉన్నట్లు చెబుతున్నారు.అంతేకాకుండా అకస్మాత్తుగా ఆర్థికంగా అభివృద్ధి కూడా చెందుతారని చెబుతున్నారు.పిచ్చుకలు ఇంటికి తూర్పు వైపున గూడు కట్టుకుంటే అది ఆనందానికి, శ్రేయస్సుకి సంకేతం అని చెబుతున్నారు.
అలాగే ఆగ్నేయంలో పిచ్చుక గూడు కడితే ఆ ఇంట్లో త్వరలోనే వివాహాది కార్యక్రమాలు జరుగుతాయని సంకేతం.ఇక నైరుతి దిశలో కానీ పిచ్చుకలు గూడు కట్టుకుంటే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడంతో పాటు ఎక్కువగా ధనం చేతికి వస్తుందని దానికి సూచికం.
అంతేకాకుండా పంటలు కూడా బాగా పండుతాయి అని దానికి అర్థం.ఇక పావురం( Pigeon ) ఇంటి బాల్కనీలో కానీ, కిటికీలో కానీ గూడు కట్టడం వలన దురదృష్టానికి సంకేతంగా పరిగణించడం జరుగుతుంది.దీని వలన ఆర్థిక సంక్షోమాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అలాగే ఇంటి లోపలి పరిసరాల్లోకి కానీ గబ్బిలాలు( Bats ) వచ్చిన కూడా ఇది చెడు సంకేతం గానే భావించాలి.
దీని వలన త్వరలోనే ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.