వయసు పైబడే కొద్ది జ్ఞాపక శక్తి ( Memory power )తగ్గడం సర్వసాధారణం.కానీ ఇటీవల కాలంలో చాలా మందికి తక్కువ వయసులోనే జ్ఞాపకశక్తి మందగిస్తోంది.
పోషకాల కొరత, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, చెడు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతుంటాయి.ఏదేమైనా సరే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే మెదడుకు పదును పెడుతూ ఉండాలి.జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా తోడ్పడతాయి.అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ జ్యూస్( Miracle juice ) కూడా ఒకటి.
ఈ జ్యూస్ ను రోజుకు ఒక గ్లాసు చొప్పున తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం జ్ఞాపక శక్తిని పెంచే ఆ మిరాకిల్ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బిట్ రూట్ తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక దానిమ్మ పండును తీసుకుని గింజలు వేరు చేసి పెట్టుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ లో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు,( Beet root slices ) దానిమ్మ గింజలు మరియు అరకప్పు సీడ్ లెస్ గ్రేప్స్ వేసుకోవాలి.ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన బీట్ రూట్ దానిమ్మ గ్రేప్ జ్యూస్( Pomegranate Grape Juice ) రెడీ అవుతుంది.ఈ జ్యూస్ ను నేరుగా సేవించవచ్చు.లేదా ఫిల్టర్ చేసుకుని కూడా తీసుకోవచ్చు.కొందరికి నేరుగా తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
అలాంటివారు ఫిల్టర్ చేసుకుని తీసుకోవడమే ఉత్తమం.
ఇకపోతే ఆరోగ్యానికి ఈ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది.విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉండే ఈ జ్యూస్ ను రోజు తీసుకోవడం వల్ల బ్రెయిన్ సూపర్ షార్ప్ గా మారుతుంది.జ్ఞాపకశక్తి మరియు ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.
అల్జీమర్స్ తో సహా మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.అంతేకాదు ఈ బీట్ రూట్ దానిమ్మ గ్రేప్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తహీనత ( Anemia )దూరం అవుతుంది.
కంటి చూపు రెట్టింపు అవుతుంది.అలాగే ఈ జ్యూస్ వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.
చర్మం యవ్వనంగా మెరిసేలా సైతం ప్రోత్సహిస్తుంది.