మీ ఇంట్లో పావురం ఈ దిక్కున గూడు పెట్టిందా.. అయితే మీరు..!

సాధారణంగా మన ఇళ్లలో పక్షులు గూళ్ళు కడుతూ ఉంటాయి.అయితే ఇలా పక్షులు గూళ్ళు కట్టుకోవడం గురించి వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ఏం చెబుతుందంటే, పక్షులకు కొన్ని దిక్కుల్లో గూళ్ళు కట్టుకోవడం వలన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువగా మనం ఇళ్లలో పావురాలు, పిచ్చుకలు, పొలం పిచ్చుకలు, గూళ్ళు కట్టుకోవడం చూస్తూ ఉంటాము.

అయితే ఇలా పక్షులు( Birds ) ఇంట్లో ఏ దిక్కున తమ ఇంటిని నిర్మించుకుంటే మంచిది అంటే.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి బాల్కనీలో కానీ, కిటికీలో కానీ పిచ్చుకలు( Sparrow ) చిన్న చిన్న గూళ్ళు కట్టుకుంటే మాత్రం అది శుభ సూచకంగా చెబుతున్నారు.

"""/" / ఇంట్లో లక్ష్మీదేవి( Lakshmi Devi ) కొలువై ఉండటానికి ఎక్కువగా ఆస్కారాలు ఉన్నట్లు చెబుతున్నారు.

అంతేకాకుండా అకస్మాత్తుగా ఆర్థికంగా అభివృద్ధి కూడా చెందుతారని చెబుతున్నారు.పిచ్చుకలు ఇంటికి తూర్పు వైపున గూడు కట్టుకుంటే అది ఆనందానికి, శ్రేయస్సుకి సంకేతం అని చెబుతున్నారు.

అలాగే ఆగ్నేయంలో పిచ్చుక గూడు కడితే ఆ ఇంట్లో త్వరలోనే వివాహాది కార్యక్రమాలు జరుగుతాయని సంకేతం.

ఇక నైరుతి దిశలో కానీ పిచ్చుకలు గూడు కట్టుకుంటే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడంతో పాటు ఎక్కువగా ధనం చేతికి వస్తుందని దానికి సూచికం.

"""/" / అంతేకాకుండా పంటలు కూడా బాగా పండుతాయి అని దానికి అర్థం.

ఇక పావురం( Pigeon ) ఇంటి బాల్కనీలో కానీ, కిటికీలో కానీ గూడు కట్టడం వలన దురదృష్టానికి సంకేతంగా పరిగణించడం జరుగుతుంది.

దీని వలన ఆర్థిక సంక్షోమాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఇంటి లోపలి పరిసరాల్లోకి కానీ గబ్బిలాలు( Bats ) వచ్చిన కూడా ఇది చెడు సంకేతం గానే భావించాలి.

దీని వలన త్వరలోనే ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గేమ్ ఛేంజర్ రా మచ్చా మచ్చా సాంగ్ లో వీణ స్టెప్ అదుర్స్.. మ్యాజిక్ రిపీట్ చేశారుగా!