గ్లామరస్ యాంకర్ శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ సినిమా ఈ నెల 19వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో శ్రీముఖి ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు.సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఎన్నో కీలక విషయాలను, తన గురించి ఎవరికీ తెలియని విషయాలను వెల్లడిస్తున్నారు.
ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న శ్రీముఖి ప్రస్తుతం చేతినిండా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
అదుర్స్ అనే షో ద్వారా యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీముఖి పటాస్ షో ద్వారా స్టార్ యాంకర్ స్టేటస్ ను అందుకున్నారు.
ఆ షో శ్రీముఖి కెరీర్ కు ప్లస్ అయిన సంగతి తెలిసిందే.జులాయితో పాటు మరికొన్ని సినిమాల్లో నటించిన శ్రీముఖి ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు.
పటాస్ షోపై కొన్ని విమర్శలు వచ్చినా రాములమ్మగా శ్రీముఖికి క్రేజ్ తో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరిగింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న శ్రీముఖి సినిమాలు , షోలకు సంబంధించిన అప్ డేట్లతో పాటు ఇతర విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన సమయంలో తనకు ఇబ్బందిగా అనిపించిందని ఆమె అన్నారు.ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చానని తాను ఏడ్చేదాననినని శ్రీముఖి చెప్పుకొచ్చారు.
నాన్న స్టార్ యాంకర్ కావాలని తనకు సర్ది చెప్పేవారని శ్రీముఖి కామెంట్లు చేశారు.
ఆ సమయంలో తాను మనస్సు మార్చుకున్నానని షూటింగ్ లో చాలా సమయం నిలబడాల్సి ఉంటుందని అలాంటి షోల వల్ల కాళ్లలో తిమ్మిర్లు వచ్చేవని శ్రీముఖి తన కష్టాలను వెల్లడించారు.
యాంకర్ గా చేసే ప్రతి ఒక్కరూ ఇలాంటి కష్టాలు పడతారని ఆమె అన్నారు.యాంకర్ శ్రీముఖి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.