క్యాప్ పెట్టుకోవడం వల్ల జుట్టు అధికంగా రాలుతుందా.. ఇందులో నిజం ఎంత?

హెయిర్ ఫాల్( Hair fall ).ఏజ్, జండ‌ర్ తో పని లేకుండా కోట్లాది మందిని కలవర పెట్టే సమస్యల్లో ఒకటి.

 Does Wearing A Cap Cause Excessive Hair Loss? Hair Loss, Health, Hair Fall, Hair-TeluguStop.com

హెయిర్ ఫాల్ దాదాపు అందరిలోనూ ఉంటుంది.కానీ కొందరిలో మాత్రం చాలా అధికంగా ఉంటుంది.

జుట్టు రాలడానికి అందరిలోనూ కారణాలు ఒకేలా ఉండవు.అయితే హెయిర్ ఫాల్ విషయంలో చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి.

అవేంటి.వాటిలో నిజం ఎంత.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.తలకు క్యాప్ పెట్టుకోవడం వల్ల జుట్టు అధికంగా రాలుతుందని కొందరు నమ్ముతుంటారు.

కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు.క్యాప్ పెట్టుకోవడానికి, జుట్టు రాలడానికి సంబంధమే లేదు.

క్యాప్ ధరించడం వల్ల జుట్టు కుదుళ్ళకు ఎటువంటి హాని జరగదు.కాబ‌ట్టి, ఎలాంటి భ‌యం లేకుండా త‌లకు క్యాప్ ధ‌రించ‌వ‌చ్చు.

Telugu Care, Care Tips, Fall, Healthy-Telugu Health

అలాగే తల స్నానం చేయడం వల్ల జుట్టు అధికంగా రాలుతుందని కొందరు భావిస్తుంటారు.ఈ క్రమంలోనే తలస్నానం చేయడానికి జంకుతుంటారు.కానీ అది అపోహ మాత్రమే.నిజానికి తలస్నానం వల్ల జుట్టు కుదుళ్ళలో ఉన్న మురికి మొత్తం శుభ్రపడుతుంది.జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే వారంలో కచ్చితంగా రెండు సార్లు తల స్నానం చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు.అయితే వేడి వేడి నీటితో త‌ల‌స్నానం చేయ‌కూడ‌దు.

మ‌రియు త‌ల స్నానం చేసిన‌ వెంటనే దువ్వడం, చిక్కులు తీయడం వంటివి చేయకూడదు.ఇటువంటి పొరపాట్ల వల్లే జుట్టు అధికంగా రాలుతుంద‌ని గుర్తుంచుకోండి.

Telugu Care, Care Tips, Fall, Healthy-Telugu Health

ఇక విటమిన్ టాబ్లెట్స్ ( Vitamin tablets )ను తీసుకుంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుందని భావిస్తుంటారు.కానీ డాక్టర్ల స‌ల‌హా లేకుండా మీకు ఇష్టం వచ్చిన విటమిన్ టాబ్లెట్స్ ను వాడితే జుట్టు రాలడం ఆగడం కాదు మరింత పెరుగుతుంది.నిజానికి జుట్టు ఆరోగ్యం( Hair health ) కోసం పోషకాలను టాబ్లెట్స్ రూపంలో కంటే సహజంగా ఆహారం ద్వారా పొందడానికి ప్రయత్నించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube