సాధారణంగా మనం పుట్టిన తేదీ సమయాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి చెప్పవచ్చు.అలాగే మన పుట్టిన తేదీని బట్టి మన ఇష్టాయిష్టాలు మనకు కలిసొచ్చే రంగులు, అదృష్ట సంఖ్యలు,అలాగే ఎలాంటి వస్తువులను మన ఇంట్లో పెట్టుకోవడం లేదా మనం ఏ విధమైనటువంటి వస్తువులను ఉపయోగించడం వల్ల మంచి జరుగుతుంది అనే విషయాల గురించి పండితులు చెబుతుంటారు.
ఈ క్రమంలోనే మనం పుట్టిన తేదీ ఆధారంగా ఏ వస్తువులను మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
*ఒకటవ తేదీ పుట్టిన వారు వారి ఇంటిలో వెదురుతో తయారు చేసిన వేణువు ఉత్తరదిశలో పెట్టుకోవడం ఎంతో మంచిది.
*రెండవ తేదీ జన్మించిన వారు తెలుపు రంగు గవ్వలతో తయారు చేసిన బొమ్మను వాయువ్య దిశలో పెట్టుకోవడం మంచిది.*మూడవ తేదీ జన్మించిన వారి ఇంటిలో ఈశాన్య దిశలో రుద్రాక్షమాలను పెట్టడం చాలా శుభకరం.
*నాలుగవ తేదీ జన్మించిన వారి ఇంటిలో అద్దం దీర్ఘచతురస్రాకారంలో చిన్న చిన్న ముక్కలుగా కోసినైరుతి దిశలో పెట్టుకోవాలి ఇవి కనుక చెల్లాచెదురుగా ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు కీడు జరిగే ప్రమాదం ఉంది.
*ఐదవ తేదీ జన్మించిన వారు వారి ఇంటిలో ఉత్తరదిశలో కుబేరుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి.*ఆరవ తేదీ జన్మించిన వారు ఆగ్నేయ దిశలో నెమిలిపించం పెట్టుకోవడం మంచిది.*ఏడవ తేదీ జన్మించిన వారు ముదురు రంగులో ఉండే రుద్రాక్షలను దిశలో పెట్టాలి.*ఏనిమిదవ తేదీ జన్మించిన వారు దక్షిణ దిశలో నలుపురంగు క్రిస్టల్స్ పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది.
*9వ తేదీ పుట్టిన వారు ఇంట్లో దక్షిణ దిశలో పిరమిడ్ పెట్టుకోవడం ఎంతో మంచిది.11 వ తేదీలలో పుట్టిన వారు1+1=2 కనుక వీరు రెండవ తేదీ పుట్టిన వారు ఏ వస్తువులను పెట్టుకుంటే మంచిదో ఆ వస్తువులను పెట్టుకోవాలి.12 వతేదీ పుట్టిన వారికి మూడు అనే నెంబర్ వస్తుంది కనుక 3 వ తేదీకి సంబంధించిన వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం మంచిది.