శరీరానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన వనరుల్లో ప్రోటీన్ ఒకటి.శరీరంలో ఎప్పుడైతే ప్రోటీన్ కొరత ఏర్పడుతుందో అప్పుడు నీరసం, అలసట, జీర్ణ వ్యవస్థ నెమ్మదించడం, రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడటం, కీళ్ళు కండరాల నొప్పులు, మూత్రపిండాల పనితీరుకు అడ్డంకులు, జుట్టు అధికంగా రాలడం, శరీర బరువును అదుపు తప్పడం తదితర సమస్యలు మొదలవుతాయి.
అందుకే శరీరంలో ప్రోటీన్ కొరత ఏర్పడకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.ఈ నేపథ్యంలోనే చాలా మంది మార్కెట్లో లభ్యమయ్యే ప్రోటీన్ పౌడర్ల ను వాడుతుంటారు.
అయితే అటువంటి ప్రోటీన్ పౌడర్ లను వాడటం కంటే.ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే ప్రోటీన్ షేక్ ను తయారు చేసుకుని రోజు తీసుకుంటే ఊహించని ఆరోగ్య లాభాలను మీ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోటీన్ షేక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిన్నకప్పు సోయా బీన్స్ వేసుకుని గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు నానబెట్టుకున్న సోయా బీన్స్‌ను మిక్సీ జార్లో వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి సోయా పాలను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ ను తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు రోస్ట్డ్ ఓట్స్, వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఐదు బాదం పప్పులు, వన్ టేబుల్ స్పూన్ పీనట్ బటర్, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక గ్లాస్ సోయా పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ ప్రోటీన్ షేక్ సిద్ధం అయినట్టే.
ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ షేక్ ను ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకుంటే కనుక ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయి.బరువు తగ్గుతారు.మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.
జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.నీరసం, అలసట, ఒత్తిడి వంటివి దూరం అవుతాయి.
అధిక రక్తపోటు కంట్రోల్ అవుతుంది.మరియు హెయిర్ ఫాల్ నుంచి సైతం విముక్తి లభిస్తుంది.