చుండ్రును ఒక్క వాష్ లో పోగొట్టే సూపర్ పవర్ ఫుల్ టోనర్ మీ కోసం!

ఆడ మగ అనే తేడా లేకుండా చాలా మంది ఫేస్ చేసే సమస్యల్లో చుండ్రు ( Dandruff ) ఒకటి.

అందులోనూ ప్రస్తుత ఈ వర్షాకాలంలో చుండ్రు సమస్య అనేది మరింత ఎక్కువ ఇబ్బంది పెడుతుంటుంది.

వర్షాల్లో తరచూ తడవడం ఇందుకు ప్రధాన కారణం.ఏదేమైనా కూడా చుండ్రు అనేది తీవ్రమైన అసౌకర్యాన్ని, చికాకును కలగచేస్తుంది.

ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఒక్క వాష్ లోనే చుండ్రును పోగొట్టే సూపర్ పవర్ ఫుల్ టోనర్ ఒకటి ఉంది.

ఈ టోనర్ ను కనుక వాడితే చుండ్రు అన్న మాటే అనరు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టోనర్ ను( Toner ) ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు,( Fenugreek Seeds ) రెండు టేబుల్ స్పూన్లు బియ్యం,( Rice ) వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు,( Flax Seeds ) నాలుగు బిర్యానీ ఆకులు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి.

ఆ తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి నైట్ అంతా వదిలేయాలి.

మరుసటి రోజు ఆ గిన్నెను స్టవ్ పై పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

"""/" / ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం ( Castor Oil ) వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన టోనర్ అనేది రెడీ అవుతుంది.

ఈ టోనర్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

ఈ టోనర్ ఆల్మోస్ట్ ఒక్క వాష్ లోనే చుండ్రు మొత్తాన్ని దూరం చేస్తుంది.

ఒకవేళ చుండ్రు మీకు మరీ ఎక్కువగా కనుక ఉంటే మరో రెండు సార్లు ఈ టోనర్ ను వాడండి.

చుండ్రును సంపూర్ణంగా వదిలించుకోండి. """/" / పైగా ఈ టోనర్ చుండ్రును పోగొట్టడానికి మాత్రమే కాదు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.

వారానికి ఒకసారి ఈ న్యాచురల్ టోనర్ ను కనుక వాడితే జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.

హెయిర్ ఫాల్ దూరం అవుతుంది.కురులు ఒత్తుగా, సిల్కీ గా సైతం మారతాయి.

గుండె జబ్బులకు దూరంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ గింజలను తప్పక తీసుకోండి!