ఈ రోజుల్లో చాలామంది ప్రేమాయణాలు నడిపిస్తున్నారు.కొందరు ప్రేమికులు తమ ప్రేమను నిలబెట్టుకుని పెళ్లిళ్లు చేసుకుని హాయిగా సెటిలైపోతున్నారు.
మరి కొంతమంది మాత్రం బ్రేకప్( Breakup ) చెప్పుకుంటున్నారు.వారూ సంతోషంగానే ఉంటున్నారు.
కొద్ది మంది మాత్రమే బ్రేకప్ తర్వాత సైకోల్లాగా మారుతున్నారు.లేదంటే తమకు తామే హాని చేసుకుంటా అన్నారు.
ఇటీవల ఆగ్రాకు( Agra ) చెందిన ఒక యువకుడు తన ప్రేయసి తనని విడిచిపెట్టిందని తట్టుకోలేకపోయాడు.అందుకే ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో విషం తాగాడు.
అది దోమలను చంపడానికి ఉపయోగించే మందు( Mosquito Repellent ) మనుషులకి మాత్రం విషం.ఈ సూసైడ్ అటెంప్ట్ సంచలనం సృష్టించింది.

ఈ ఘటన సమయంలో యువకుడి మానసిక స్థితి చాలా దిగజారిపోయి ఉందని, ఆయన ప్రవర్తన చూసి ప్రేక్షకులు భయాందోళన చెందారని తెలుస్తుంది.ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు ప్రేక్షకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి యువకుడిని కాపాడేందుకు ప్రయత్నించారు.

విషం తాగిన ఈ భగ్న ప్రేమికుడిని పోలీసులు సకాలంలో రక్షించారు.లైవ్ స్ట్రీమ్‌లో( Live Stream ) వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు యువకుడి ఇంటికి చేరుకున్నారు.ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి యువకుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అతని ఆరోగ్యం కోలుకునేందుకు వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.ఈ ఘటన తర్వాత యువకుడికి మానసిక చికిత్స కూడా అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకూడదని, మనల్ని ప్రేమించే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి ఈ లోకంలో ఎవరూ లేరని ఎప్పుడూ అనుకోకూడదని పోలీసులు సూచించారు.అలాగే బాధలో ఉన్న కుటుంబ సభ్యులపై ఎప్పుడూ ఒక కనీసం ఉండాలని అందరికీ సలహా ఇచ్చారు.







