సామాజిక దూరం పదంపై పిటీషన్... 10 వేలు ఫైన్ వేసిన సుప్రీం కోర్టు

కరోనా వైరస్ కారణంగా ప్రజల మధ్యలో మనిషికి మనిషికి మధ్య దూరం ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

దీనికి సామాజిక దూరం అనే పేరు పెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చాయి.

కరోనా వైరస్ కట్టడి చేయాలంటే సామాజిక దూరం ఒకటే మార్గం అని విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి.ప్రపంచ దేశాలన్నీ కూడా సోషల్ డిస్టెన్స్ అంటూ ఇదే పదాన్ని ఉపయోగిస్తున్నాయి.

అయితే కొంత మంది కుహన మేధావులు ఈ పదాన్ని కూడా ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.సామాజిక దూరం అనే పదం ఉపయోగించడం అంటే అంటరానితనంని సపోర్ట్ చేస్తున్నట్లే అని వాఖ్యలు చేస్తున్నారు.

ఈ విషయంపై కమ్యూనిస్ట్ లీడర్స్ ముందుగా వాదనని తెరపైకి తీసుకొచ్చారు.చాలా రాష్ట్రాలలో తక్కువ కులాల వారిని, మైనార్టీలని దూరం పెట్టడానికి సామాజిక దూరం అనే పదం ఉపయోగిస్తారని వాదిస్తున్నారు.

Advertisement

ఇక ఈ పదం కాకుండా భౌతిక దూరం అనే పదం వాడాలని డిమాండ్ చేస్తున్నారు.తాజాగా సామాజిక దూరం అనే పదాన్ని దేశ వ్యాప్తంగా ఉపయోగిస్తుండడంపై షకీల్ ఖురేషి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఇదే పదాన్ని వాడుతున్నాయని, సోషల్ డిస్టెన్సింగ్ అనే పదం మైనారిటీ వర్గాల పట్ల వివక్షను సూచించేలా ఉందని తన పిటిషన్ లో పేర్కొన్నాడు.భౌతికదూరం అనే పదం వాడేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరాడు.

అయితే, సుప్రీం ధర్మాసనం ఆ పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇలాంటి సమయంలో కూడా పదాలకి కులాలు అంటగట్టి చూడటం సరైన పద్ధతి కాదని ఆ పిటిషన్ ను కొట్టివేయడమే కాకుండా, కోర్టు సమయాన్ని వృథా చేశాడంటూ 10 వేలు జరిమానా విధించింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు