విశాఖలో తమ పార్టీ కార్యకర్తల విడుదల కోసం జనసేన న్యాయపోరాటానికి సిద్ధమైంది.ఈ నేపథ్యంలోనే నేడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.
అయితే విశాఖలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నడుమ జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.వీరిలో తొమ్మిది మందిని పోలీసులు రిమాండ్ లో ఉంచారు.
మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మధ్యాహ్నం వరకూ విశాఖలోనే ఉండనున్నారని సమాచారం.మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్ కు వెళ్లనున్నారు.
మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో నోవాటెల్ హోటల్ పరిసరాలు, ఆర్కే బీచ్ రోడ్డులో పోలీసులు భారీగా మోహరించారు.కాగా నిన్న బీచ్ రోడ్డుకు పవన్ అభిమానులు భారీగా రావడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది.