మెగా హీరో వైష్ణవ తేజ్( Vaishnav Tej ) సరసన ఉప్పెన( Uppena ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి కృతి శెట్టి( Krithi Shetty ) మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం వరుసగా రెండు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా మారిపోయిన బేబమ్మకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి .
అనంతరం ఈమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.ఇక కృతి శెట్టి కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం ఈమె తమిళ సినిమాలకు కమిట్ అయ్యి షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక తెలుగులో ఈమెకు పెద్దగా ఏ సినిమాలలో అవకాశాలు రాలేదని తెలుస్తుంది.ఈ క్రమంలోనే తమిళ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి కృతి శెట్టి తాజాగా టాలీవుడ్ హీరోల( Tolly wood Heroes ) గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమాలో నటించిన హీరోయిన్ మంచి సక్సెస్ అందుకుంటేనే తర్వాత వారికి అవకాశాలు వస్తాయి లేకపోతే టాలీవుడ్ హీరోలు ఆ హీరోయిన్ గురించి ఆలోచించడం కూడా మానేస్తారని కామెంట్ చేశారు.
ఏదైనా అవసరం నిమిత్తం మనమే వారికి ఫోన్ చేసిన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు అంటూ తెలిపారు./br>
కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో అలా కాదు ఇక్కడ హీరోలకు హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు హీరోయిన్ కష్టాన్ని గుర్తిస్తారు వారు సినిమా కోసం ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని గమనించి సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన వారికి తర్వాత సినిమాలలో అవకాశాలు కల్పిస్తారు అంటూ కోలీవుడ్ హీరోల గురించి గొప్పగా చెబుతూ టాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో కృతి శెట్టి వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ హీరోల అభిమానులు తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.ప్రస్తుతం కృతి శెట్టి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.