సమంత దేవ్ మోహన్ ప్రధాన పాత్రలలో గుణశేఖర్ దర్శకత్వంలో సోసియో ఫాంటసీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం శాకుంతలం.ఈ సినిమా అద్భుతమైన ప్రేమ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరి 17వ తేదీ ఎంతో ఘనంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి అర్హకు సంబంధించిన ఓ అప్డేట్ విడుదల చేశారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా అల్లు అర్జున్ వారసురాలిగా అల్లు అర్హ ఇంత చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి రావడంతో అల్లు అర్జున్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.అయితే ఈమె శాకుంతలం సినిమాలో శకుంతల కుమారుడు భరతుడి పాత్రలో సందడి చేయనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి అవుతున్నట్టు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ సినిమాలో అల్లు అర్హ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నటువంటి ఒక ఫోటోని అల్లు స్నేహారెడ్డి అలాగే అల్లు అర్జున్ తమ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.అల్లు స్నేహారెడ్డి నిత్యం తన పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడం వల్ల అల్లు అర్హకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇలా ఇంత చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్హ వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసి బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.అయితే ప్రస్తుతం ఈమె డబ్బింగ్ పనులకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సినిమా కోసం సమంత అభిమానులతో పాటు బన్నీ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ ఎంతో ఘనంగా విడుదల కానుంది.