సరిగమప టైటిల్ విన్నర్ యశస్వి కొండెపూడి ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.ఈయన కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ ఉంటోన్న పిల్లలతో ఫొటోలు దిగి.
అది తనే నడుపుతున్నానని ఆ పిల్లల బాగోగులు తానే చూసుకుంటున్నానని చెప్పుకొచ్చారు.దీంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున వివాదంగా మారింది.
ఇలా యశస్వి కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా ప్రచారం చేసుకుంటున్నారని నవసేన ఫౌండేషన్ నిర్వాహకురాలు ఫరా కౌసర్ మండిపడ్డారు.
గత కొన్ని సంవత్సరాలుగా తన ఫౌండేషన్ ద్వారా సుమారు 60 మంది పిల్లల చదువులను వారి బాగోగులను తన సొంత డబ్బుతోనే చూసుకుంటున్నానని ఈమె తెలిపారు.యశస్వి మాత్రం తన ఫౌండేషన్ పేరు వాడుకోవడమే కాకుండా తన పౌండేషన్ బాధ్యతలు చూసుకుంటున్నాను అంటూ అసత్య ప్రచారాలు చేశారు.దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది నేటిజన్స్ సింగర్ యశస్వి పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ తనని ట్రోల్ చేస్తున్నారు.
ఇలా తన గురించి వస్తున్న ట్రోల్స్ పై యశశ్వి స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌండేషన్ బాధ్యతలు నేను తీసుకున్నానని అది నాదే అని నేను ఏక్కడ చెప్పలేదు.నాకు, ఈ ఫౌండేషన్‌కు అసలు సంబంధమే లేదు.
సాధ్య ఫౌండేషన్‌కు మేమంతా సాయం చేస్తుంటాం.ఈ ఫౌండేషన్ తమకు నచ్చిన మరికొన్ని సంస్థలకు చేయూత అందిస్తుంది.
ఈ క్రమంలోనే నవసేన ఫౌండేషన్ కి కూడా సాయం చేశారని మాత్రమే చెప్పినట్లు వెల్లడించారు.నవసేన ట్రస్టుకి మూడు, నాలుగుసార్లు హెల్ప్ చేశారు.
కాబట్టి వాళ్లతో ఆల్‌ద బెస్ట్ చెప్పించుకుంటామన్నారు.ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు అన్నింటినీ కూడా ఈయన షేర్ చేశారు.
అయితే తన సంస్థ పేరు వాడుకున్నందుకు తొమ్మిది నెలలపాటు తన నవసేన ఫౌండేషన్ లో తానే చూసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.నాకు ఉన్నంతలో సహాయం చేస్తాను కానీ దత్తత ఎందుకు తీసుకుంటానని తెలిపారు.
ఇప్పటివరకు నా మీద ఎక్కడ ఒక చిన్న నెగిటివ్ మార్కు లేకుండా ఉన్నాను.మొదటిసారి బుద్ధి తక్కువై ఎపిసోడ్‌కు వీడియోలు ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు.
దీంతో ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.