విదేశీ గడ్డపై తొలిసారి షూటింగ్ జరుపుకున్న తెలుగు చిత్రం సాహసవంతుడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించగా వాణిశ్రీ హీరోయిన్ గా నటించింది.ఇక ఈ చిత్రం నిర్మాత విద్యాసాగర్.ఈయన యువకుడు విద్యాధికుడు ఏం కామ్ చదివాడు.సినిమా అంటే విద్య సాగర్ కి ఎంతో ఆసక్తి.ఎన్టీఆర్ తో సినిమా తీయాలని కోరిక విద్యాసాగర్ కి ఉండేది.
అంతవరకు విదేశాల్లో ఏ తెలుగు చిత్రం షూటింగ్ జరగలేదు.ఆ ఖ్యాతి తనకే దక్కాలని నేపాల్ లో సాహసవంతుడు చిత్రం తీయడానికి ముందుకు వచ్చారు.
విద్యాసాగర్ ఉత్సాహాన్ని గమనించిన ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చి ప్రోత్సహించారు.సాహసవంతుడు సినిమా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాల్లో షూటింగ్స్ జరుపుకుంది.
అయితే నేపాల్ నేపథ్యము కలిగిన కథను నిర్మాత ఎన్నుకోవడం నిజంగా ఒక సాహసం.
ఆ రోజుల్లో ఖాట్మండుకి చెన్నై నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేదు కలకత్తా వెళ్లి అక్కడ మరో విమానం ఎక్కాలి అంటే ఐదు గంటల ప్రయాణం టెక్నీషియన్లు ఖాట్మండ్ చేరాలంటే మొత్తంగా నాలుగు రోజుల జర్నీ.ఖాట్మండు పరిసర ప్రాంతాల్లో పది రోజుల పాటు కీలక సన్నివేశాలు, కరాటే ఫైట్, రెండు పాటలు చిత్రీకరించారు.అప్పట్లో విదేశాలకి ఎన్టీఆర్ వెళ్లడం అదే మొదటిసారి.
నేపాల్ ఆనవాయితీ ప్రకారం అక్కడ ప్రభుత్వం ఏ విమానం కొన్నా కూడా నేపాల్ రాజు పూజ చేసిన తర్వాత జాతికి అంకితం ఇస్తారు.కానీ పూజ కు ముందే ఎన్టీఆర్ ఎక్కే విమాన దృశ్యాలను చిత్రీకరించాల్సి రావడం తో పూజ కూడా జరగకుండా నేపాల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సినిమా కోసం విమానాన్ని ఇచ్చారు.
ఇక ఈ సినిమా నిర్మాత విద్యాసాగర్ చాలా అదృష్టవంతుడనే చెప్పాలి.ఎందుకంటే ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే రెండు పెద్ద సంఘటనలు జరిగాయి.ఒకసారి విద్యాసాగర్ ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదం బారిన పడింది.ఆ ప్రమాదంలో కారు పెద్ద లోయలోకి పల్టీలు కొట్టిన నిర్మాతకు ఏమీ కాలేదు.ఇక మరోసారి లక్షన్నర క్యాష్ ఉన్న సూట్ కేసును పోగొట్టుకున్నారు.కానీ వారం తర్వాత అది దొరికింది.
అందుకే విద్యసాగర్ ని అదృష్టవంతుడు అంటారు.ఇక సాహసవంతుడు సినిమా 1978 అక్టోబర్ 6న విడుదల అయింది.