వలలో ఖరీదైన చేప.. జాక్ పాట్ కొట్టిన జాలరి

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం బంగారమ్మ పాలెం సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ ముక్కుడు టేకు చేప వలకు చిక్కింది.సుమారు 1500 కేజీల బరువు వుండే ఈ చేప ఎస్.

 Expensive Fish In The Net.. The Fisherman Who Hit The Jack Pot ,fisherman ,fishe-TeluguStop.com

రాయవరం మండలం బంగారమ్మపాలెం సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారుల బృందం వేసిన వలకు చిక్కింది.ఈ ముక్కుడు టేకు చేప అరుదైన జాతి అని.దీనిని ఔషధ తయారీలో ఉపయోగిస్తారని., దీని విలువ సుమారు మూడు లక్షల రూపాయలు ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు.

ఇంత భారీ చేపను ఒడ్డుకు తీసుకుని రావడానికి చాలా శ్రమ పడ్డామని వేటకు వెళ్లిన మత్స్యకారులు అంటున్నారు.ముక్కుడు టేకు చేపను చూడడానికి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారు.

భారీ సైజులో ఉండే టేకు చేపలు సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకార వలలకు చాలా రేర్‌గా వెళ్లి చిక్కుతుంటాయి.  సముద్ర గర్భంలో ఉండే టేకు చేప బయటికి రావడం.

అది వలకు చిక్కడంతో జాలర్ల ఆశ్చర్యానికి గురయ్యారు.టేకు చేప తినేందుకు పనికిరాదని.

ఔషధాలతయారీలో ఉపయోగిస్తారని నిపుణులు తెలిపారు.టేకు చేప వెనుక భాగంలో తోకకు ఉండే ముళ్లు చాలా ప్రమాదకరమైనవి.

సముద్రంలో చిన్న చేపలను తింటూ జీవనం సాగించే ఇవి ఒక్కొక్కటి దాదాపు 2500 కేజీల వరకు వెయిట్ పెరుగుతాయట.వీటిపై ఏవైనా పెద్ద సముద్ర జీవులు దాడికి యత్నిస్తే.

  ఏనుగు తొండం మాదిరిగా… తోక సాయంతో కౌటంర్ అటాక్ చేసి తమను తాము సేవ్ చేసుకుంటాయి.మాములుగా స్నేహపూర్వకంగానే మెలిగే ఈ టేకు చేప.భయపడిన స్థితిలోనే తోకతో దాడికి యత్నిస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube