ఇదేందయ్యా ఇది: యాంటీ వైరస్ హోటల్.. మీరు కానీ ట్రై చేశారా..?!

ఒక్కొక్కరిదీ ఒక్కో వింత ఆలోచన.ఆ ఆలోచనలలో కొన్ని హిట్ అవుతాయి మరి కొన్ని ప్లాప్ అవుతాయి.

 Antivirus Tiffin Center Viral In Social Media, Corona Effect, Hotel Owner, Busin-TeluguStop.com

మరికొంతమంది పేరులో ఏముంది అని ఎందరో వుంటారు.అయితే ఆ పేరులోనే మొత్తం మ్యాటర్ కనిపించేలా కొందరు వారి క్రియేటివిటీని జోడిస్తారు.

అందుకే కాబోలు కొందరు సినీ తారలు వెండితెరపై వచ్చాక పేరు మార్చుకుంటారేమో.బిజినెస్ కోసమో లేకపోతే మరేదో కొత్తరకంగా ట్రై చేసేందుకో కానీ హోటల్ యజమాని మాత్రం ప్రస్తుతం పరిస్థితిని అనుగుణంగా తన హోటల్ కి ట్రెండీ పేరును పెట్టాడు.

తన హోటల్ కు యాంటీ వైరస్ టిఫిన్ సెంటర్ అని నామకరణం చేశాడు.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు లోకి వెళితే.

ఫుట్ పాత్ పై నడుస్తూ ఉంటే చుట్టుపక్కల ఎన్నో రకాల టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు మనకు కనిపిస్తూనే ఉంటాయి.అయితే వారి వద్ద ఎవరికి వారే మా దగ్గర ఫుడ్ టేస్ట్ గా ఉంటుందని చెబుతుంటారు.

అయితే ఇందులో కొందరు మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తారు.ప్రజలను ఆకట్టుకొని బిజినెస్ పెంచుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు.కొందరు టేస్ట్ పరంగా ఆలోచిస్తే మరికొందరు పేర్ల పరంగా ఆలోచిస్తారు.ఇలాంటి కోవలోకే వచ్చింది ఈ యాంటీవైరస్ టిఫిన్ సెంటర్.

ప్రస్తుతం ఈ హోటల్ సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.పేరు ఏమో యాంటీ వైరస్ అని పేరు పెట్టాడు కానీ ఆ హోటల్ కు సంబంధించి ఓ నెటిజన్ మాత్రం అక్కడ ఎలాంటి సోషల్ డిస్టెన్స్ పాటించలేదని, టిఫిన్ కౌంటర్ వద్ద ఐదు మందికి పైగా ఉన్న కానీ అక్కడ సామాజిక దూరం పాటించకుండా పక్కపక్కన నిలబడి టిఫిన్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు.

అలాగే ఓ బోర్డుమీద ఇడ్లీ, దోశ, ఉప్మా సమోసా.అంటూ ఓ లిస్ట్ పెట్టేశాడు.

అక్కడ కేవలం సోషల్ డిస్టెన్స్ మాత్రమే కాదని.అక్కడ వంట వండే వారు కూడా ఎలాంటి మాస్క్, గ్లౌజ్ లాంటివి ఉపయోగించకుండా వంట చేస్తున్నారు.అయితే ఈ ఫోటోకి సంబంధించి సోషల్ మీడియాలో మిశ్రమంగా కామెంట్స్ వస్తున్నాయి.మీరు ఇలాంటి హోటల్లో టిఫిన్ తింటే సామాజిక దూరం అవసరం లేదని చెబుతుండగా.

మరికొందరు ఇన్ని రకాల యాంటీవైరస్ రకాలు అందుబాటులో ఉంటే ఇక కరోనా వ్యాక్సిన్ ఏమి అవసరం ఉండదు అని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube