సింగరేణి ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది.కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తన్నాయి.
సింగరేణి ఎన్నికల ప్రచారానికి ఇవాళ ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటంతో అధికార కాంగ్రెస్ ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.ఈనెల 27వ తేదీన ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు కూడా వెల్లడికానున్నాయన్న సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల్లో మొత్తం 13 కార్మిక సంఘాలు బరిలో నిలవనుండగా 39,991 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
కాగా సింగరేణిలో ఇప్పటివరకు ఆరుసార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి.