వైర‌ల్ పిక్‌.. సింహం ముందు కుక్క ఫోజులు మామూలుగా లేవు

అడ‌విలో సింహానికి ఎద‌రు ప‌డితే ఇంకేమైనా ఉంటుందా చెప్పండి.ప్రాణాలు గాల్లో క‌లిసిపోవ‌డం ఖాయం.

 Viral Pic Dog Poses In Front Of A Lion Are Not Uncommon Details, Viral Pic, Dog-TeluguStop.com

అది గుహ‌లో ఉన్నంత వ‌ర‌కే బ‌య‌టి జీవుల ప్రాణాలకు డోకా ఉండ‌దు.కానీ దాని ముందుకు వెళ్తే మాత్రం చావును కోరి తెచ్చుకున్న‌ట్టే అవుతుంది.

అందుకే అడ‌వికి రాజుగా సింహాన్ని చెబుతుంటారు.కాగా ఇప్పుడు ఓ సింహంతో కుక్క చేసిన ఫోజులు నెట్టింట్లో న‌వ్వులు పూయిస్తున్నాయి.

దాన్ని చూసిన వారంతా కూడా పొట్ట చెక్క‌ల‌య్యే విధంగా న‌వ్వుకుంటూ మీమ్స్ పెడుతున్నారు.అదేంటో ఇప్పుడు చూద్దాం.

ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా భ‌యంతో చాలామంది ఇండ్ల‌కే ప‌రిమితం అవుతున్నారు.ఇంకా కొంద‌రు రిచ్ పీపుల్ అయితే ఫాంహౌస్‌‌లలో బ‌తుకుతున్నారు.ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియోలో కూడా ఓ కుటుంబం ఇలాగే త‌మ ఫామ్ హౌస్ లో ఉంటుంది.అయితే త‌మ కుక్క కూడా వారితో ఉంటుంది.

ఫామ్ హౌస్ కావ‌డంతో ద‌గ్గ‌ర‌లోని అడ‌వినుంచి ఓ ఆడ సింహం ఆ ఇంటికి వచ్చింది.ఇక సింహం రాక‌ను ఆ కుక్క గ్లాస్ డోర్ నుంచే క‌నిపెట్టేసింది.

సింహం అలాగే ఇంటి డోర్ ముంద‌టికి రావ‌డం ఈ ఫొటోలో కనిపిస్తుంది.

Telugu Dog Poses, Female, Animals, Pet Dog, Pet Dog Infront, Dog-Latest News - T

ఇక డోర్‌కు గ్లాస్ ఉండ‌టంతో ఆ సింహం లోప‌ల‌కు రాలేక‌పోయింది.అయ‌తే ఆ సింహాన్ని చూసిన కుక్క మాత్రం లేని బిల్డ‌ప్‌ల‌కు పోతోంది.డోర్ తీయండి ఆ సింహాన్ని త‌రిమికొడ‌తాను అన్న‌ట్టు ఫోజులు కొట్ట‌డం మ‌న‌కు ఈ ఫొటోలో క‌నిపిస్తుంది.

సింహానికి, ఆ కుక్క‌కు మ‌ధ్య‌లో గాజు డోర్ ఉంది కాబ‌ట్టి ఆ ఇంటి సింహం అలా రెచ్చిపోయింద‌న్న‌మాట‌.కానీ అదే డోర్ ఒక్క‌సారి ఓపెన్ అయితేనే ఇంకేముంది ఆ కుక్క‌కు మూడిన‌ట్టే.

ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు బాగా వైర‌ల్ అవుతున్నాయి.కుక్క‌ను చూసిన వారంతా ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube