కోలీవుడ్ హీరోలు కూడా మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టాలీవుడ్ అందరి కంటే ముందు వరుసలో ఉంది.
మన వాళ్ళు అన్ని కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.అయితే కోలీవుడ్ హీరోలు మాత్రం కేవలం దక్షిణాది భాషల్లోనే తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
ఇక దక్షిణాదిలో అతి పెద్ద సీజన్ ఏది అంటే అది సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి.మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ కు సంక్రాంతి సీజన అతి పెద్దది.
ఈ పండుగకు మన స్టార్ హీరోలు తమ సినిమాలను బరిలోకి దింపేందుకు రెడీ అవుతారు.అలాగే అదే సమయంలో పక్క ఇండస్ట్రీల వారు కూడా తమ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు.
ఇక రాబోయే సంక్రాంతి పండుగకు కూడా కోలీవుడ్ నుండి రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
అందులో ఒకటి విజయ్ దళపతి నటించిన వారసుడు కాగా.
మరొకటి అజిత్ కుమార్ నటించిన తునివు.కోలీవుడ్ లో బిగ్గెస్ట్ మాస్ హీరోగా అవతరించిన అజిత్ సినిమా వస్తుంది అంటే అక్కడ మాములు అంచనాలు ఉండవు.
మరి ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ సినిమా తునివు మీద కూడా చాలా అంచనాలు నెలకొన్నాయి.
వలిమై దర్శకుడు వి హెచ్ వినోద్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది.ఓవర్సీస్ బిజినెస్ హక్కులను బడా నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.తాము ఈ సినిమాను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది అని అనౌన్స్ చేసారు.
ఇక ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.బోణీ కపూర్ నిర్మించారు.
చూడాలి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో.