RRR Rajamouli : ఆర్‌ఆర్ఆర్‌ కి ఆస్కార్‌ నామినేషన్‌.. కానీ కష్టమే!

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమా ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.దాదాపు 1200 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారీ ఎత్తున పాజిటివ్ టాక్ దక్కించుకుంది.

 Rrr Movie Going To Get Nominations In Oscar , Rrr, Ntr, Oscar, Rajamouli, Ram Ch-TeluguStop.com

అంతే కాకుండా సినిమా కి డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా హాలీవుడ్ సినిమా రేంజ్ లో రెస్పాన్స్ దక్కింది.ఈ సినిమా ను ఆస్కార్‌ బరి లో నిలిపేందుకు చిత్ర యూనిట్ సభ్యులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క నామినేషన్ దాదాపుగా ఖరారు అయింది.వీఎఫ్‌ఎక్స్‌ కేటగిరిలో ఈ సినిమా ఆస్కార్‌ బరిలో నిలువ బోతుంది అన్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థ ఒక కథనం లో పేర్కొంది.

Telugu Oscar, Rajamouli, Ram Charan, Rrr-Movie

విఎఫ్ఎక్స్ ఈ సినిమా లో అద్భుతంగా వచ్చాయి.అందుకే ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశం కన్ఫామ్ అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.అయితే ఆస్కార్ కి నామినేట్ అయినా కూడా ఆస్కార్ రావడం అనేది కష్టం.ఎందుకంటే అవతార్ 2 తో పాటు పలు హాలీవుడ్ సినిమా లు కూడా విఎఫ్ఎక్స్ కి నామినేట్ అవుతాయి.

కనుక ఆస్కార్స్ బరిలో ఆ సినిమా లను క్రాస్ చేసి మన సినిమా గెలవడం అనేది దాదాపుగా అసాధ్యం.అయితే ఆస్కార్ కి నామినేట్ అవ్వడం కూడా చాలా గొప్ప విషయం.

ఒక ఇండియన్‌ సినిమా అది కూడా తెలుగు లో రూపొందిన సినిమా.ఆస్కార్ వరకు వెళ్లడం అనేది గొప్ప పురస్కారం.

అవార్డు.ముందు ముందు రాజమౌళి చేయబోతున్న సినిమా లు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకోవాలని కోరుకుందాం.

ఈ సినిమా మాత్రం ఆస్కార్‌ కి నామినేట్ అయితే గొప్ప విషయం అన్నట్లుగా అందరం ఆశిద్దాం.ఆల్ ది బెస్ట్ టు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube