ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే తులసి కోటను చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్క ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తాము.

మన హిందువుల ఇంటి ఆవరణంలో తులసి మొక్క లేని ఇల్లు అంటూ ఉండదు.

ఇలా తులసికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి కోటకు పూజ చేయడం చూస్తుంటాము.

తులసి మొక్కను సాక్షాత్తు మహాలక్ష్మిగా భావించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేయటం వల్ల మన ఇంటిలో ఏ విధమైనటువంటి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉండవని భావిస్తారు.

అయితే ఈ తులసి మొక్కను పూజించడానికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి.

సాయంత్రం తులసి మొక్కను పూజించేటప్పుడు తులసికోటకు పొరపాటున కూడా నీరు పోయకూడదు.సాయంత్రం సమయంలో తులసి చెట్టు కింద సాక్షాత్తు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కూర్చుని ఉంటారని అందుకే సాయంత్రం తులసి కోటకు నీళ్లు పోయకూడదని పండితులు చెబుతారు.

అదేవిధంగా అమావాస్య, పౌర్ణమి, మంగళ, ఆదివారం, ద్వాదశి వంటి రోజులలో తులసి దళాలను తెంపకూడదని చెబుతుంటారు.

"""/"/ ఇకపోతే ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే తులసికోటను చూడటం వల్ల ముల్లోకాలలోని సమస్త పుణ్య తీర్థాల చూసిన పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

అందుకే ఉదయం నిద్రలేవగానే తులసి కోటను చూడటం ఎంతో మంచిది.అదే విధంగా మనకు అష్టైశ్వర్యాలు కలగాలంటే 26 శుక్రవారాలు తులసి వ్రతాన్ని చేయడం వల్ల మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

దొండ‌కాయ తింటే మ‌తిమ‌రుపు వ‌స్తుందా.. అస‌లు ఇందులో నిజ‌మెంత‌..?