జగన్ పై డౌట్ ? టీడీపీ కి దగ్గరగా బీజేపీ ?

ఏపీలో బలపడేందుకు చాలాకాలం నుంచి బిజెపి ప్రయత్నాలు చేస్తున్నా, అవేవీ వర్కవుట్ కావడం లేదు.గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండడంతో, ఆ పొత్తుని ఉపయోగించుకుని టీడీపీ బాగా లాభపడింది.

 Bjp Trying To Alliance With Tdp With Suspicion On Jagan, Jagan, Bjp, Janasena, T-TeluguStop.com

కానీ బీజేపీకి పెద్దగా ఒరిగిందేమీ లేదు అనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది.అంతే కాకుండా టిడిపితో పొత్తు పెట్టుకున్న లేక టిడిపి బలంగా ఉన్నా, బిజెపి బలపడేందుకు అవకాశం లేదు అనేది ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అభిప్రాయం.

అందుకే టిడిపి నేతలు బిజెపికి దగ్గరయ్యేందుకు, పొత్తు పెట్టుకునేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, సోము వీర్రాజు మాత్రం దానిని అడ్డుకుంటూనే వస్తున్నారు.

అలాగే కేంద్ర బిజెపి పెద్దలు సైతం టిడిపిని వీలైనంత దూరంగా పెడుతూ వస్తున్నారు.

కాకపోతే 2024 ఎన్నికల సమయంలో బిజెపి గెలుపు కష్టంగా మారుతుంది అని, అప్పుడు మళ్లీ జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, జగన్ మద్దతు తమకు తప్పనిసరిగా ఏర్పడుతుంది అనేది బిజేపి పెద్దల అభిప్రాయం.కాకపోతే 2019  ఎన్నికల్లో  జగన్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తగిన రాజకీయ సలహాలు అందించిన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం కాంగ్రెస్ కోసం పని చేస్తుండడంతో, జగన్ సైతం ఆయన సూచనతోనే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారని, ఖచ్చితంగా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ ఒప్పుకోరని, అప్పుడు తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ముందుచూపుతో కమలనాథులు ఉన్నారట.

Telugu Amith Sha, Ap Cm, Chandrababu, Jagan, Janasena, Modhi, Pavan Kalyan, Ysrc

అందుకోసమే 2024 నాటికి మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే లెక్కల్లో ఉన్నారట.ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నా, పెద్దగా ప్రయోజనం లేనట్టుగానే పరిస్థితి ఉండడం, జనసేన, బిజెపి బలం గెలిచేందుకు ఏమాత్రం సరిపోదు అనే అభిప్రాయంతో టిడిపిని కూడా కలుపుకు వెళ్లాలనే ఆలోచనలో బిజెపి పెద్దలు ఉన్నట్టు విస్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.కాకపోతే టీడీపీ అదినేత చంద్రబాబు గురించి బీజేపీ పెద్దలకు బాగా తెలుసు.అయినా తప్పని సరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే, వెనుకాడకూడదు అని, కేంద్రంలో అధికారంలోకి రావడమే తమ ఏకైక లక్ష్యం అన్నట్లుగా కేంద్ర బిజెపి పెద్దలు  ఇప్పుడు టిడిపి విషయంలో సానుకూలంగా ఉన్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube