తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది లెజెండరీ నటులు ఉన్నారు అందులో కొద్ది మంది గురించి చెప్పడానికి మాత్రం మాటలు సరిపోవు అలాంటి వాళ్లలో ప్రకాష్ రాజ్(Prakash Raj) ఒకరు… ఈయన పోషించిన పాత్రల్లో నటించడం అనే కంటే కూడా జీవిస్తాడు అని చెప్పాలి.ఎందుకంటే ఆయన చేసే పాత్రల్లో అంతలా లినమైపోయి నటిస్తాడు…
అయితే తెలుగులో ఉన్న టాప్ డైరెక్టర్లు అందరూ ప్రకాష్ రాజ్ ని వాళ్ల సినిమాల్లో తీసుకున్నారు.అలాంటిది రాజమౌళి (Rajamouli) మాత్రం విక్రమార్కుడు సినిమాలో ఒక చిన్న పాత్ర 5 నిమిషాల పాటు స్క్రీన్ మీద కనపడే పాత్రలో మాత్రమే ఆయన్ని తీసుకున్నారు ఆ ఒక్క సినిమాలో తప్ప రాజమౌళి తీసిన మిగితా ఏ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ లేరు ఆయన్ని రాజమౌళి ఎందుకు తీసుకోలేదు అనే డౌట్ అందరికీ ఉంటుంది

ఇదే విషయాన్ని రాజమౌళి గారి దగ్గర అడిగితే ప్రకాష్ రాజ్ గారు ఇప్పటి వరకు చేయని పాత్ర లేదు ఆయన్ని మనం అన్ని పాత్రల్లో చూశాం… ఆయన మళ్ళీ నా సినిమాలో కూడా అదే రకం పాత్ర వేస్తే చూసే జనానికి బోర్ కొడుతుంది.ఆయన ఇంతవరకు చేయని పాత్ర ఏదైనా నా సినిమాలో వచ్చినప్పుడు నేనే ఆయనతో నా సినిమాలో చేయించుకుంటా అని చెప్పారు…

రాజమౌళి ఇచ్చే ఎలివేషన్స్ లకి ఆయన సినిమాల్లో ప్రకాష్ రాజ్ విలన్ గా చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది.అందుకే ప్రకాష్ రాజ్(Prakash Raj) గారిని ఇష్టపడే వాళ్ళు ఆయన రాజమౌళి సినిమాలో ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తే బాగుండేది అని అనుకుంటున్నారు…ఇప్పటి దాకా అయితే రాజమౌళి సినిమాల్లో ఈయన పెద్దగా చేయలేదు కానీ ఇక మీదట వచ్చే సినిమాల్లో చేసే అవకాశం రావచ్చు దేనికైనా టైం రావాలి అని సిని పెద్దలు అంటారు…
.







