తాత వయస్సులో మూడో పెళ్లి అవసరమా.. అమీర్ పై ఎంపీ ఫైర్..?

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ రెండో భార్య కిరణ్ రావుకు కొన్నిరోజుల క్రితం విడాకులు ఇవ్వాలని షాకింగ్ నిర్ణయం తీసుకుంది.ఇద్దరు ఒకరి అంగీకారంతో మరొకరు విడిపోయినప్పటికీ అమీర్ ఖాన్ ఫ్యాన్స్ కు మాత్రం అమీర్ ఖాన్ తీసుకున్న నిర్ణయం అస్సలు నచ్చలేదు.

 Bjp Mp Sudheer Gupta Fires On Bollywood Hero Aamir Khan,  Bollywood Hero Aamir K-TeluguStop.com

మరోవైపు అమీర్ ఖాన్ త్వరలో మూడో పెళ్లి చేసుకోనున్నారని సోషల్ మీడియా, వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
అమీర్ ఖాన్ విషయంలో జరుగుతున్న ప్రచారం గురించి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమీర్ ఖాన్ మొదట రీనా దత్తాను వివాహం చేసుకుని 15 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు.ఒక యంగ్ హీరోయిన్ తో సన్నిహితంగా ఉండటం వల్లే కిరణ్ రావుకు అమీర్ ఖాన్ విడాకులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Telugu Aamir Khan, Bjp Mp, Bjpmp, Bollywoodaamir, Kiran Rao, Tapsee-Movie

కొంతమంది నెటిజన్లు అమీర్ ఖాన్ హిందూ మహిళలకు అన్యాయం చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా ప్రస్తుతం అమీర్ ఖాన్ వయస్సు తాత వయస్సు అని ఇలాంటి సమయంలో మూడో భార్య అతనికి అవసరమా అంటూ అమీర్ పై ఎంపీ ఫైర్ అయ్యారు.అమీర్ ఖాన్ రెండో భార్యకు విడాకులు ఇవ్వడం వల్ల ఆయన సినిమాలపై కూడా ఆ నెగిటివిటీ ప్రభావం పడే అవకాశం ఉంది.

లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో అమీర్ ఖాన్ ప్రస్తుతం నటిస్తుండటం గమనార్హం.

ఫారెస్ట్ గంప్ అనే సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.కరీనా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా నాగచైతన్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

నెటిజన్ల విమర్శలకు అమీర్ ఖాన్ ఏమని సమాధానం చెబుతారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube