ఒక హిట్ వస్తేనే మరో ఇండస్ట్రీకి వెళ్లే రకం కాదు నేను... రిషబ్ శెట్టి కామెంట్స్ వైరల్!

కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రిషబ్ శెట్టి (Rishabh Shetty) దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు.ఇక ఈయన తన స్వీయ దర్శకత్వంలోనే గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం కాంతార ( Kantara ) ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

 Rishabh Shetty Indirectly Satires On Rashmika And Prashanth Neel, Rishabha Shet-TeluguStop.com

కేవలం కన్నడ భాషలో మాత్రమే విడుదలైనటువంటి ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ కావడంతో ఇతర భాషలలో కూడా విడుదల చేశారు.ఇలా అన్ని భాషలలో కూడా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

Telugu Kantara, Prashanth Neel, Rashmika, Rishabha Shetty, Sandalwood-Movie

ఇలా ఈ సినిమా ఎంతో మంచి విజయం కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా తెరకేక్కించే పనిలో రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.తాజాగా గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో కాంతారకు అవార్డు వచ్చింది.ఆ అవార్డు కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

నాకు ఇతర భాషల నుంచి ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి.వస్తున్నాయి అయితే నేను వాటిని ఎప్పడు గౌరవిస్తూనే ఉంటాను కానీ నాకు ముందుగా హిట్ ఇచ్చినది మాత్రం కన్నడ ప్రేక్షకులేనని తెలిపారు.

Telugu Kantara, Prashanth Neel, Rashmika, Rishabha Shetty, Sandalwood-Movie

ఇలా నన్ను ఆదరించింది నా కన్నడ ప్రేక్షకులనని వారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను అని తెలిపారు.అందుకే నేను కన్నడ సినిమాలలోనే చేస్తానని ఒక హిట్టు వచ్చింది కదా అని వేరే భాషలలోకి వెళ్లి సినిమాలు చేసే రకం కాదు నేను అంటూ ఈ సందర్భంగా కామెంట్ చేశారు .అయితే ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈయన ఎవరిని ఉద్దేశించి అన్నారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ను ఉద్దేశించి అన్నారా లేక నటి రష్మికను( Rashmika ) ఉద్దేశించి అన్నారా అన్నది సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

వీరిద్దరు కూడా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన వారే అయితే వీరికి మంచి సక్సెస్ రావడంతో కన్నడ చిత్ర పరిశ్రమలు కాకుండా తెలుగు హిందీ భాష చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube