అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వర్ల రామయ్య!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మినీ సైజ్ కురుక్షేత్రం జరుగుతుంది.

గతంలో అక్రమ కట్టడాలుగా తేలిన టీడీపి నాయకులకు చెందిన కట్టడాలను నోటీసులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కూల్చి వేసింది.

ప్రస్తుతం దీనిపై టీడీపి నాయకులు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.అంతేకాకుండా కోర్టులో వరుసగా చుక్కెదురు అవుతుందని అందుకని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నోటీసులు ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన భవనాలను కూలగొడుతున్నారని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

తాజాగా అందులో భాగంగా టీడీపి సీనియర్ నేత వర్ల రామయ్య రాష్ట్ర ప్రభుత్వం మెప్పు పొందడం కోసం కొందరు అధికారులు తమ పరిధిని దాటి మరీ వ్యవహరిస్తూ ఇలా ప్రతిపక్షాలను ఏడిపించుకు తింటున్నారని ప్రభుత్వంలో ఏ పార్టీ వారు శాశ్వతంగా ఉండరని ఆ విషయాన్ని అధికారులు గుర్తుంచుకుంటే మంచిదని అధికారులను ఉద్దేశిస్తూ ఆయన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.గతంలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామని అందుకు నిదర్శనంగానే ప్రజావేదికను ధ్వంసం చేస్తున్నామని ప్రకటించిన జగన్ సర్కార్ ఆ తరువాత ఆ మాటను గాలికి వదిలేసింది.

తాజాగా గీతంకు సంబంధించిన ఓ భవనాన్ని కూలగొట్టింది.ప్రస్తుతం దీనిపై రాష్ట్ర రాజకీయాలలో పెద్ద రభస జరుగుతుంది.

Advertisement

మరి ఈ రభసలో ఎవరిది పై చేయో తెలుసుకోవడం కోసం కొద్ది రోజులు వేచి ఉండాల్సి ఉంది.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు