బాలీవుడ్ ప్రముఖ నటుడు హీరో అమీర్ ఖాన్ తల్లి తీవ్రమైన గుండెపోటుకు గురైనట్టు తెలుస్తోంది.అమీర్ ఖాన్ తల్లి జీనత్ అనారోగ్యం క్షీణించడంతో ఈమె గుండెపోటుకు గురయ్యారని తెలుస్తోంది.
ఇలా ఈమె గుండెపోటుకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు.దీపావళి పండుగ సందర్భంగా అమీర్ ఖాన్ తన పంచగని ఇంటికి వెళ్లారు.
తల్లికి గుండెపోటు వచ్చి పరిస్థితి విషమించడంతో హుటాహుటిన తనని ఆసుపత్రికి తరలించారు.
ఇక జీనత్ గుండెపోటుకు గురయ్యారనే విషయం తెలియగానే కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు.
అయితే ప్రస్తుతం ఈమె పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అమీర్ ఖాన్ తల్లి ఐ సి యు లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని ఈమె ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుందని తెలుస్తోంది.
ఇలా తన తల్లి అనారోగ్యం చేయడంతో అమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు మొత్తం ఆసుపత్రి వద్ద ఉన్నారని అయితే ఈ విషయాన్ని అమీర్ ఖాన్ ఎక్కడ బయటకు చెప్పకపోవడం గమనార్హం.

ఇక అమీర్ ఖాన్ తన తల్లి అనారోగ్యం గురించి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు అల్లుతారని దయచేసి ఉన్నవి లేనివి కల్పించి వార్తలు రాయొద్దు అంటూ ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మీడియాని కోరినట్లు సమాచారం.అందుకే తన తల్లి ఆరోగ్య విషయానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.ఇక ఈ విషయం తెలిసినటువంటి కొందరు సెలబ్రిటీలు ఆమె త్వరగా కోలుకొని క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు.







