కన్నడ హీరో రిషబ్ శెట్టి తన దర్శకత్వంలోనే నటించిన చిత్రం కాంతార ఈ సినిమా అన్ని భాషలలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా మంచి హిట్ కావడంతో దేశవ్యాప్తంగా రీషబ్ శెట్టి పేరు మార్మోగిపోతుంది.
ఇలా దేశవ్యాప్తంగా ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే తాజాగా రిషబ్ శెట్టి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు.సినిమాలలోకి రాకముందు తాను పడినటువంటి కష్టాల గురించి తెలియజేశారు.ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా హీరో రిషబ్ శెట్టిని ప్రశ్నిస్తూ కాంతార సినిమాని హిందీలో రీమేక్ చేస్తారా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు రిషబ్ శెట్టి సమాధానం చెబుతూ అస్సలు రీమేక్ చేయనని షాకింగ్ సమాధానం చెప్పారు.
ఈ విధమైనటువంటి పాత్రలు చేయాలంటే మూలాలు ఆ సంస్కృతి పై ఎంతో నమ్మకం ఉండాలి.అయితే హిందీ చిత్ర పరిశ్రమలో తాను అభిమానించే ఎంతోమంది హీరోలు ఉన్నారు కానీ ఈ సినిమాని మాత్రం తాను హిందీలో రీమేక్ చేయదలచుకోవడం లేదని అలాంటి ఆలోచన కూడా చేయలేదని తెలిపారు.

ఇక ఈ సినిమా షూటింగ్ కు ముందు తాను 30 రోజుల నుంచి నాన్ వెజ్ కూడా తినడం మానేసి ఈ సినిమాలో నటించానని, దైవ్ కోల అలంకారం వేసుకున్న తర్వాత కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకునేవాడినికి ఈయన తెలిపారు.అనంతరం ప్రసాదం మాత్రమే తనకు పెట్టేవారు అంటూ రిషబ్ వెల్లడించారు.ఇలా సాంప్రదాయం పై ఎంతో నమ్మకంతో భక్తితో ఈ సినిమాలో నటించానని ఈ సందర్భంగా రిషబ్ శెట్టి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







