మన పూర్వీకులు ఎప్పుడూ నిప్పుతో చెలగాటం ఆడొద్దని చెబుతుంటారు.ఎందుకంటే నిప్పు చాలా ప్రమాదకరం.
కొంచెం ఆదమరిచినా ప్రాణాలకే ప్రమాదం.కానీ కొందరు సాహసం చేసి నిప్పుతో స్టంట్స్ చేస్తుంటారు.
ఈ స్టంట్స్ చూడటానికి, చేయడానికి ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది.అయితే ఇలాంటి ప్రమాదకమైర స్టంట్స్ అప్పుడప్పుడు బెడిసి కొడుతుంటాయి.
తాజాగా ఇలాంటి ఓ ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నిప్పుతో స్టంట్ చేస్తున్న ఓ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు.
మంటలను సృష్టించే క్రమంలో అతడి గడ్డం కాలిపోయింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.
రవి పాటిదార్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొద్ది రోజుల కిందట ఓ వీడియోను షేర్ చేశాడు.ఈ వీడియోలో ఓ వ్యక్తి మండపంపై నిలబడి ఉంటాడు.
అతడి చేతిలో ఓ స్టిక్ ఉంటుంది.ఆ స్టిక్‌పై నిప్పుంటుంది.
షోలో భాగంగా ఆ వ్యక్తి తన నోట్లో పెట్రోల్ పోసుకుంటాడు.పెట్రోల్‌ను స్టిక్‌పై వేగంగా పోయడంతో భారీగా మంటలు చెలరేగాయి.అనంతరం స్టిక్‌ని తన ముఖానికి దగ్గరికి తీసుకొచ్చాడు.దీంతో అతడి గడ్డంపై మంటలు చెలరేగాయి.
దీంతో ఆ వ్యక్తి చేసిన స్టంట్స్ ఒక్కసారిగా అడ్డం తిరిగింది.అతడి గడ్డానికి మంటలు వ్యాపించాయి.

అది గమనించిన స్థానికులు అతడి దగ్గరికి పరిగెత్తారు.అతడి ముఖాన్ని చేతులతో కొడుతూ మంటలు ఆర్పేశారు.మంటలు భారీగా చెలరేగడంతో ఆ నొప్పికి యువకుడు ఎంతో విలవిలలాడాడు.అయితే ఈ వీడియో ఎక్కడ తీశారనే విషయంపై క్లారిటీ లేదు.ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 12.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి.నెటిజన్లు ఈ వీడియోను చూసి భయాందోళనకు గురవుతున్నారు.జీవితాన్ని ఫణంగా పెట్టి ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.నిప్పుతో చెలగాటం ఆడొద్దని, చివరికి మసిగానే మిగిలిపోతారని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.







