VIDEO: వామ్మో! నిప్పుతో పెట్టుకున్నాడు.. గడ్డం కాల్చుకున్నాడు?

మన పూర్వీకులు ఎప్పుడూ నిప్పుతో చెలగాటం ఆడొద్దని చెబుతుంటారు.ఎందుకంటే నిప్పు చాలా ప్రమాదకరం.

కొంచెం ఆదమరిచినా ప్రాణాలకే ప్రమాదం.కానీ కొందరు సాహసం చేసి నిప్పుతో స్టంట్స్ చేస్తుంటారు.

ఈ స్టంట్స్ చూడటానికి, చేయడానికి ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది.అయితే ఇలాంటి ప్రమాదకమైర స్టంట్స్ అప్పుడప్పుడు బెడిసి కొడుతుంటాయి.

తాజాగా ఇలాంటి ఓ ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నిప్పుతో స్టంట్ చేస్తున్న ఓ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు.

మంటలను సృష్టించే క్రమంలో అతడి గడ్డం కాలిపోయింది.పూర్తి వివరాల్లోకి వెళితే.

రవి పాటిదార్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొద్ది రోజుల కిందట ఓ వీడియోను షేర్ చేశాడు.

ఈ వీడియోలో ఓ వ్యక్తి మండపంపై నిలబడి ఉంటాడు.అతడి చేతిలో ఓ స్టిక్ ఉంటుంది.

ఆ స్టిక్‌పై నిప్పుంటుంది.షోలో భాగంగా ఆ వ్యక్తి తన నోట్లో పెట్రోల్ పోసుకుంటాడు.

పెట్రోల్‌ను స్టిక్‌పై వేగంగా పోయడంతో భారీగా మంటలు చెలరేగాయి.అనంతరం స్టిక్‌ని తన ముఖానికి దగ్గరికి తీసుకొచ్చాడు.

దీంతో అతడి గడ్డంపై మంటలు చెలరేగాయి.దీంతో ఆ వ్యక్తి చేసిన స్టంట్స్ ఒక్కసారిగా అడ్డం తిరిగింది.

అతడి గడ్డానికి మంటలు వ్యాపించాయి. """/"/ అది గమనించిన స్థానికులు అతడి దగ్గరికి పరిగెత్తారు.

అతడి ముఖాన్ని చేతులతో కొడుతూ మంటలు ఆర్పేశారు.మంటలు భారీగా చెలరేగడంతో ఆ నొప్పికి యువకుడు ఎంతో విలవిలలాడాడు.

అయితే ఈ వీడియో ఎక్కడ తీశారనే విషయంపై క్లారిటీ లేదు.ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 12.

3 మిలియన్ వ్యూస్ వచ్చాయి.నెటిజన్లు ఈ వీడియోను చూసి భయాందోళనకు గురవుతున్నారు.

జీవితాన్ని ఫణంగా పెట్టి ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

నిప్పుతో చెలగాటం ఆడొద్దని, చివరికి మసిగానే మిగిలిపోతారని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.