ఆ కండెక్టర్ కలెక్టర్ కాలేదు!

నిజం.ఆ కండెక్టర్ కలెక్టర్ కాలేదు.

 Fake News Spread Media About Conductor To Collector-TeluguStop.com

ఆశ్చర్యం వేస్తుందా? అవును నిజంగానే ఆ కండెక్టర్ ప్రజలందరినీ దారుణంగా మోసం చేశాడు.ఎంత దారుణంగా అంటే ? అతను ప్రస్తుతం కండెక్టర్ అని.త్వరలోనే కలెక్టర్ అవుతాను అని ఓ మీడియాతో చెప్పాడు.ఇంకా అంతే ఆ మీడియా వెనుక ముందు ఆలోచించకుండా అతని గురించి ఓ రేంజ్ లో ప్రచారం చేశారు.

ఇంకా మిగితా మీడియాలు వూరికే ఉంటాయా? అవి కూడా అంతే.మరుసాటి రోజు.

అతను నిజంగానే కలెక్టర్ అయినట్టు.అతని వద్దకు వెళ్లి ఇంటర్వ్యూలు.

కండెక్టర్ గా అతను టిక్కెట్లు ఇస్తున్న ఫోటోలు తీసి అతని మీద ఓ రేంజ్ లో ఆర్టికల్స్ రాశాయి.అతను కూడా చెప్పాడు.7 గంటలు కండెక్టర్ ఉద్యోగం చేసి 5 గంటలు చదివేవాడు అని.

ఇంకా అందరూ.”ఇంతకన్నా గొప్ప విజయం ఉంటుందా? కండెక్టర్ నుండు కలెక్టర్ వరుకు” అని టైటిల్స్ పెట్టేసి మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు రాసేశారు.నిజమే.

కండెక్టర్ నుండి కలెక్టర్ వరుకు అంటే గొప్ప విజయమే కానీ అది అతను చెప్పిన అబద్దం.అది ఎలా మీడియాలో రాస్తారు ? నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా?

దీంతో ఆ కండెక్టర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హైలెట్ అయ్యాడు.ఒక్క రోజులో స్టార్ పబ్లిసిటీ వచ్చింది.అయితే ముంబైలో ఓ ప్రముఖ పత్రిక పాత్రికేయుడుకు సందేహం రావడంతో అసలు నిజం బయట పడింది.సివిల్స్ లో సెలెక్ట్ అయినా వారి జాబితాను పరిశీలించగా అక్కడ ఆ కండెక్టర్ పేరు మధు లేదు .మధుకుమారి అనే ఒక అమ్మాయి పేరు మాత్రం ఉంది.

దీంతో ఆ పత్రిక వారు సోషల్ మీడియా నుండి ఆ వార్తలు తొలిగించారు.అతను గ్రేట్ అని అనిపించుకోవడం ఏమో కానీ.చివరికి ఆ కండెక్టర్ కు తిట్లు.చివాట్లు మిగిలియి.

కండెక్టర్ సంగతి పక్కన పెడితే.మీడియా అయినా కాస్త తెలుసుకొని రాయద్ద? ఏదైనా ఒక వార్త వచ్చింది అంటే చాలు.అది నిజామా అబద్దమా అనేది కూడా తెలుసుకోకుండా మీడియాలో పెట్టేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube