తెగించి రిస్క్ చేస్తున్న నాగ్

అక్కినేని నాగార్జున నటించిన రీసెంట్ మూవీ వైల్డ్ డాగ్ ఫ్లాప్ మూవీగా నిలిచింది.ఈ సినిమాపై నాగ్ భారీ అంచనాలు పెట్టుకున్నా, కథలో దమ్మున్నా కూడా కరోనా కారణంగా ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.

 Nagarjuna Taking Risk Again In Second Wave, Nagarjuna, Wild Dog, Praveen Sattaru-TeluguStop.com

ఇక ఈ సినిమా తరువాత నాగ్ తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో నాగ్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.

కానీ కరోనా మహమ్మారి పరిస్థితులను నాగ్ లెక్కచేయకుండా రిస్క్ తీసుకునేందుకు రెడీ అవుతున్నాడు.

గతంలో కూడా కరోనా ఫస్ట్ వేవ్‌లో టాలీవుడ్‌లో షూటింగ్ మొదలుపెట్టిన తొలి హీరోగా నాగ్ నిలిచాడు.అన్ని జాగ్రత్తల మధ్య వైల్డ్ డాగ్ షూటింగ్‌లో పాల్గొని ఆ సినిమాను పూర్తి చేశాడు.

ఇప్పుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో రాబోయే సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను కూడా అన్ని జాగ్రత్తల మధ్య ప్రారంభించేందుకు నాగ్ రెడీ అవుతున్నాడు.ఇలా కరోనా మహమ్మారి విజృంభన వేళ కూడా నాగ్ రిస్క్ చేసి మరీ సినిమాలు చేస్తుండటంతో మిగతా హీరోలు ఆయనకు హ్యాట్సాఫ్ కొడుతున్నారు.

ఇక ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ వేశారని, త్వరలోనే ఈ సెట్స్‌లో షూటింగ్ జరుపుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో నాగ్ ఓ రా ఏజెంట్‌గా ప్రేక్షకులకు కనిపించేందుకు రెడీ అవుతుండగా, అందాల భామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

నాగ్‌తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న కాజల్, ఈ సినిమాతో మరో హిట్ అందుకోవాలని చూస్తోంది.మరి నాగ్ ఇంత రిస్క్ చేసి చేయబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube