కేవలం మూడే నెలల్లో పది కిలోల బరువు ఎలా తగ్గాడో తెలిస్తే షాక్ అవుతారు..!

దొంగతనాలకు అలవాటు పడిన వారు తమ శరీర ఆకృతిపై దృష్టి పెట్టరు.ఎందుకంటే కష్టపడకుండా డబ్బులు వచ్చేస్తున్నాయి కదా విందులకు, విలాసాలకు అలవాటు పడిపోయి తమ ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు వహించరు.

 I Would Be Shocked To Know How I Lost Ten Kilos In Just Three Months, 3 Months,-TeluguStop.com

కానీ మనం తెలుసుకోబోయే దొంగ మాత్రం కాస్త వెరైటీ అని చెప్పవచ్చు.ఒక ఇంట్లో భారీగా డబ్బులు ఉన్నాయని తెలుసుకుని ఆ ఇంట్లోకి ప్రవేశించి డబ్బులు కొట్టేయడానికి ఆ దొంగ మాములుగా కష్టపడలేదండోయ్.

కేవలం మూడంటే మూడే నెలల్లో ఏకంగా పది కేజీల బరువు తగ్గి మరి అనుకున్న పని చేసి చూపించాడు.మరి అలాంటి కిలాడీ దొంగ కధ ఏంటో తెలుసుకోండి.

గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌కు చెందిన మోతీ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి వయసు 34 సంవత్సరాలు.ఇతను భోపాల్‌ లోని బసంత్ బహార్ సొసైటీలోని మోహిత్ మరాడియా అనే సేటు ఇంట్లో పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇంట్లో పనులు చేస్తూ ఆ ఇంట్లోని విలువైన వస్తువులు, సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో అనే సమాచారం సేకరించాడు.

అలాగే ఇంట్లోకి ప్రవేశించాలంటే ఎవరయినా సరే తలుపులు బద్దలు కొట్టాలి.

లేదంటే కిటికీలో నుంచి అయిన లోపలికి వెళ్ళాలి కదా.కానీ మెహత్ మరాడియా ఇంట్లో ఎలక్ట్రానిక్ తలుపులు ఉన్నాయి.అలా అని కిటికీలో నుంచి ఇంట్లోకి ప్రవేశించాలని అనుకున్నాడు.కానీ అది కుదరలేదు.

ఎందుకంటే అతను లావుగా ఉండడం చేత కిటికీలో నుంచి ఇంట్లోకి ప్రవేశించేందుకు కుదరలేదు.అందుకనే బరువు తగ్గాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలోనే మోతీ రోజుకి ఒక్కసారే తింటూ బరువు తగ్గడానికి ప్రయత్నించి వరుసగా మూడు నెలల పాటు ఈ డైట్ పాటించడంతో సుమారు పది కేజీల బరువు తగ్గాడు.అలా లావు తగ్గి కిటికీలో నుంచి లోపలికి వెళ్లి సేటు ఇంట్లో 37 లక్షలు దొంగతనం చేసాడు.

Telugu Kg, Latest, Theift-Latest News - Telugu

అయితే దోపిడీ సమయంలో సిసి కెమెరాలకు చిక్కకుండా మోతీ జాగ్రత్తలు వహించడంతో అతడిని కనిపెట్టడం పోలీసులకు కొద్దిగా కష్టమైంది.అలా మోతీ కోసం గాలింపు చేస్తున్న సమయంలో ఒక ఇంట్లోకి చొరబడేందుకు కిచెన్ కిటికీ కట్టర్, రేజర్ బ్లేడ్ కొనడానికి ఒక హార్డ్ వేర్ స్టోర్ కి వెళ్ళాడు.ఆ హార్డ్‌వేర్ స్టోర్‌ లోని సీసీటీవీ ఫుటేజీల వలన పోలీసులు అతన్ని కనిపెట్టారు.మోతీ సెల్‌ఫోన్ లొకేషన్‌ ఆధారంగా మోతీ ఆచూకీ తెలుసుకున్నారు పోలీసులు.తన స్వగ్రామమైన ఉదయ్‌పూర్‌ కు పారిపోయేందుకు మోతీ ప్రయత్నిస్తుండగా ఎస్పీ రింగ్‌రోడ్డు పై పోలీసులు అతన్ని పట్టుకున్నారు.అరెస్ట్ చేసే సమయానికి అతని వద్ద చోరీకి గురైన డబ్బు, విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో భాగంగా మోతీ తన డైట్ రహస్యాన్ని బయటపెట్టాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube