ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల నిర్ణయాన్ని కాదని తన పట్టుదలతో రాజధాని మార్చుతున్నాడు అంటూ యనమల రామకృష్ణ అంటున్నాడు.ప్రతి విషయంలో కూడా ప్రజల ప్రయోజనాలు పట్టించుకోకుండా కేవలం ఆయన మూర్ఖత్వపు నిర్ణయాలను ముందుకు తీసుకు వెళ్తున్నాడు.
అమరావతి రాజధాని విషయంలో మరియు మండలి విషయంలో ఆయన తీరు చూస్తుంటే ఆయన ఎంత పట్టుదలతో ప్రజల విషయాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నాడో అర్థం చేసుకోవచ్చు అంటూ యనమల అన్నాడు.
ప్రజలంతా ఒకవైపు ఉంటే సీఎం జగన్ మాత్రం మరో వైపు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు.
ప్రజల నిర్ణయాన్ని ప్రజల అభిప్రాయాన్ని గౌరవించని వ్యక్తిగా సీఎం జగన్ ఉన్నాడు అంటూ యనమల అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇలాంటి రాజకీయ నాయకులు మరియు ముఖ్యమంత్రులను ఎప్పుడు చూడలేదు అంటూ ఈ సందర్బంగా యనమల అన్నాడు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు మరియు ఇతర ప్రాజెక్ట్‌ల విషయం పట్టించుకోకుండా అర్జంట్‌గా రాజధాని మార్చడం మండలి రద్దు చేయడం ఏంటంటూ యనమల ప్రశ్నించాడు.