భారత ఎన్నారైల సమస్యల పరిష్కారం కోసం...NRI Global Meet..ఎప్పుడంటే...

ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఎదుర్కుంటున్న సమస్యలు, వాటి పరిష్కారాల కోసం కర్ణాటకలో పెద్ద ఎత్తున ఎన్నారై గ్లోబల్ మీట్ జరగనుంది.ఈ మేరకు ఇండో అరబ్ కాన్ఫెడరేషణ్ కౌన్సిల్ ప్రత్యేకంగా భేటీ కానుంది.

 భారత ఎన్నారైల సమస్యల పరిష్కా�-TeluguStop.com

ఎంతో మంది ప్రవాసులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో స్థిరపడ్డారని, అయితే అక్కడ పాస్ పోర్ట్, జాత్యహంకారం ఇలా పలు రకాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఈ సమస్యల పరిష్కారం కోసమే ఈ గ్లోబల్ మీట్ ను డిసెంబర్ 4 న ఏర్పాటు చేస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు.ఇదిలాఉంటే

ఈ సమావేశానికి కేంద్ర మంత్రి రామ్ ధాస్ అధ్యక్షత వహించనున్నారు.

అంతేకాదు ఈ సమావేశానికి గోవా గవర్నర్, పలు రాష్ట్రాల మంత్రులు, పలు దేశాల దౌత్య వేత్తలు హాజరుకానున్నారని తెలుస్తోంది.ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఇండో అరబ్ కాన్ఫెడరేషణ్ కౌన్సిల్ ( ఐఏసిసి) కి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది.

సుమారు 1980 లలో ఏర్పడిన ఈ సంస్థ ప్రవాసుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది.ఒక బలమైన ట్రస్ట్ మారిన సదరు సంస్థ కేవలం భారత్ లో మాత్రమే కాకుండా పలు దేశాలలో కూడా తమ సంస్థను విస్తరించింది.

ప్రస్తుత సమావేశ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటనే విషయాన్ని సంస్థ కార్యదర్శి వివరించారు.

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణ, ఆర్ధిక నష్టాలను చవిచూశారు ఈ సమయంలో వారు పడుతున్న ఇబ్బందులపై, వాటి పరిష్కారాల చర్చ జరుగుతుందని తెలిపారు.

అంతేకాదు విదేశాల నుంచీ భారత్ కు తిరిగి వచ్చేసిన ఎన్నారైల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని వారికి పునరావాసం కల్పించడంపై ప్రత్యేక చర్చ జరుగుతుందని తెలిపారు.అలాగే భారత ప్రభుత్వం ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా నిర్వాహకులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube