చేతిలో రూ.5 వేలు కూడా లేని స్థితిలో వరుణ్ వితిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ?

Varun Sandesh Vithika Comments Goes Viral In Social Media Details Here , Varun Sandesh,vithika ,Varun Sandesh Movies,varun Sandesh Vithika Comments,Bigg Boss Show

టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ జోడీలలో వరుణ్ సందేశ్ వితిక( Varun Sandesh Vithika ) జోడీ ఒకటనే సంగతి తెలిసిందే.ఒక సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వరుణ్ సందేశ్, వితిక పెళ్లి చేసుకోవడం జరిగింది.

 Varun Sandesh Vithika Comments Goes Viral In Social Media Details Here , Varun S-TeluguStop.com

బిగ్ బాస్ షో ( Bigg Boss Show )ద్వారా ఈ జోడీకి ప్రేక్షకుల్లో కూడా పాపులారిటీ పెరిగింది.అయితే ఎప్పుడూ సంతోషంగా కనిపించే ఈ జంట తాజాగా ఒక సందర్భంలో తమకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు.

కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలు అందుకున్న వరుణ్ సందేశ్ కు తర్వాత రోజుల్లో వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి.వరుణ్ సందేశ్ నటించిన కొన్ని సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా ఫ్యాన్స్ కు తెలియదు.

సెకండ్ ఇన్నింగ్స్( Second innings ) లో వరుణ్ సందేశ్ పలు సినిమాల్లో నటిస్తున్నా ఆ సినిమాలు కూడా అతనికి షాకిస్తున్నాయి.

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ఒకానొక సమయంలో కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లిపోయానని తెలిపారు.నేను చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.సినిమాల ఎంపికలో పొరపాట్లు జరిగాయని వరుణ్ సందేశ్ చెప్పకనే చెప్పేశారు.

వితిక మాట్లాడుతూ తన ఆలోచనలు, వరుణ్ ఆలోచనలు ఒకటేనని కెరీర్ పరంగా ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడ్డామని అన్నారు.

ఒకానొక సమయంలో చేతిలో 5 వేల రూపాయలు కూడా లేని పరిస్థితి ఉందని వితిక కన్నీటి కష్టాలను చెప్పుకొచ్చారు.సెలబ్రిటీల జీవితాలలో కూడా కష్టాలు ఉంటాయని వితిక తన కామెంట్ల ద్వారా చెప్పకనే చెప్పేశారు.వరుణ్, వితిక కెరీర్ పరంగా సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

వరుణ్, వితిక కన్నీళ్లతో ఎమోషనల్ అవుతూ తమ బాధను చెప్పుకున్నారు.వరుణ్ సందేశ్ వితిక చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వితిక పలు షోలకు యాంకర్ గా వ్యవహరించారు.

Video : Varun Sandesh Vithika Comments Goes Viral In Social Media Details Here #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube